SlideShare ist ein Scribd-Unternehmen logo
1 von 24
Downloaden Sie, um offline zu lesen
www.nelavankaonline.com
T
e
l
u
g
u
‫البشرى‬ ‫مجلة‬ ‫ملحق‬ - )‫التلغوية‬ ‫(باللغة‬ ‫الهالل‬ ‫مجلة‬
1443 Vol 16, Issue: 98 July - Sept. 2022
‘
‘జన భారత్‌
జన భారత్‌’
’
‘
‘జయ
జయ భారత్‌
భారత్‌’
’ అవ్వాలంటే...
అవ్వాలంటే...
‘జన భారత్‌’
‘జయ భారత్‌’ అవ్వాలంటే...
అల్లాహ్‌! ఆయన తప్ప మరొక నిజ ఆరాధ్య దేవుడు లేడు.  
ఆయన సజీవుడు,  విశ్వ వ్యవస్థకు ఆధారభూతుడు  
ఆయనకు కునుకు రాదు మరియు నిదుర రాదు.
భూమ్యాకాశాలలో ఉన్న సమస్తమూ ఆయనకు చెందినదే.
ఆయన సమ్ముఖంలో  ఆయన అనుజ్ఞ లేకుండా సిఫారసు చేయగల
వాడెవడు?
వారి ముందు ఉన్నదీ మరియు వారి వెనుక నున్నదీ అన్నీ ఆయనకు
బాగా తెలుసు.
మరియు ఆయన కోరితే తప్ప, ఆయన జ్ఞానవిశేషాలలో ఏ
విషయమునూ వారు గ్రహించజాలరు.
ఆయన కుర్సీ  ఆకాశాలనూ మరియు భూమినీ పరివేష్టించి ఉన్నది.
వాటి సంరక్షణ ఆయనకు ఏ మాత్రం అలసట కలిగించదు. మరియు
ఆయన మహోన్నతుడు సర్వోత్తముడు. (దివ్య ఖురాన్ - 255 :2)
మానవులందరి నిజ ఆరాధ్యుని పరిచయం
July - Sept. 2022
14
6
18
Printing
design: 995 700 34
HOTELINE
‫السعيدة‬ ‫للحياة‬ ‫المفيدة‬ ‫األسباب‬ * )‫الهند‬ ‫أحوال‬ ‫(عن‬ ‫العدد‬ ‫كلمة‬ * ‫املجلة‬ ‫فهرس‬ *
‫خاتم‬ ‫وسلم‬ ‫عليه‬ ‫الله‬ ‫صلى‬ ‫محمد‬ * ‫حياتك؟‬ ‫في‬ ‫تنجح‬ ‫كيف‬ * ‫النفس‬ ‫وعزة‬ ‫االحترام‬ *
‫السفلى‬ ‫اليد‬ ‫من‬ ‫خير‬ ‫العلياء‬ ‫اليد‬ * ‫الصالة‬ ‫المسلم‬ ‫عين‬ ‫قرة‬ * ‫والرسل‬ ‫األنبياء‬
‫والمسكرات‬ ‫القمار‬ ‫عن‬ ‫تجنب‬ *
Vol 16, Issue 98
కోయిల తన భాష తాను మాట్లాడుతుంది.
అందుకే స్వేచ్ఛగా విహరిస్తుంది. అదే చిలుక
అయితే ఇతరుల పలుకుల్ని వల్లిస్తుంది. అందుకే
అది స్వాతంత్య్రం కోల్పోయి పంజరంలో ఉండాల్సి
వస్తుంది. బందీ అయిపోతుంది. ఎవరి భాషను వారు
మాట్లాడుతూ ఎవరి ఆలోచనా విధానాన్ని వారు
కాపాడుకుంటూ, ఎవరైతే ఆత్మవిశ్వాసంతో ఉంటారో
వారే ముందుకు పోతారు. నిజం మాట్లాడేవారు
కష్టాల పాలవుతారేమోగానీ, పరాజితులు కారు.
బానిసలుగా మిగలరు.
చెట్టపట్టాల్‌ పట్టుకుని
దేశస్తులందరు నడువ వలెనోయ్
అన్నదమ్ముల వలెను జాతులు
మతములన్నియు మెలగవలెనోయ్ !
గురజాడ వారు రాసిన గీతంలోని ఈ చరణాలు
నాటి భారతీయ సంస్కర్తలు, మేధావుల ఆకాంక్షనే
గాక ఆలోచనా రీతిని తెలియజేస్తాయి. వందలాది
మతాలు, జాతులు, భాషలు గల ఈ దేశం కలసి
కట్టుగానే ముందుకు సాగాలని వారు స్పష్టంగా
గుర్తించారు. సామాన్యుల నుంచి సామ్రాట్టుల
వరకూ ప్రగాఢమైన మత విశ్వాసాలు ఎప్పుడూ
వున్నాయి. వాటి ప్రభావమూ వుంది. అయినా ‘ఏ
మతమైనా బోధించదుగా ద్వేషాన్ని రూపుదిద్దుదాం
భిన్నత్వంలో ఏకత్వాన్ని’ అన్న అల్లామా ఇక్బాల్ వారి
మాట స్ఫూర్తిగా ముందుకు సాగాలి.
శాంతి, స్ధిరత్వానికి సంబంధించి, ఎన్ని ఒత్తిళ్ళు
ఎదురైనా, 1947 నుండి భారతదేశం ప్రజాస్వామ్య
దేశంగా కొనసాగిందంటే లౌకికవాదం పట్ల
మనకున్న నిబద్ధతే కారణమనేది వాస్తవం. బ్రిటిష్‌
సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా హిందువులు,
ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు కలిసి పోరాడారని
మనం గుర్తుంచుకోవాలి. 1857లో భారతదేశ
మొదటి స్వాతంత్య్ర సమరానికి నానా సాహిబ్‌,
బహదూర్‌ షా జఫర్‌, మౌల్వీ అహ్మద్‌ షా,
తాంతియా తోపే, ఖాన్‌ బహదూర్‌ ఖాన్‌, రాణి
లక్ష్మీబాయి, హజ్రత్‌ మహల్‌, అజీముల్లా ఖాన్‌,
ఫిరోజ్‌ షా వంటి నాయకులు సంయుక్తంగా
నాయకత్వం వహించారు. హిందువులు, ముస్లిములు
కలిసి అత్యున్నత త్యాగం చేసిన సందర్భాలతో మన
చరిత్ర నిండి ఉంది.
భారతదేశం నేడు అనేక సమస్యలను
‘జన భారత్‌’
‘జన భారత్‌’
‘జయ భారత్‌’ అవ్వాలంటే...
‘జయ భారత్‌’ అవ్వాలంటే...
‘జన భారత్‌’
‘జన భారత్‌’
‘జయ భారత్‌’ అవ్వాలంటే...
‘జయ భారత్‌’ అవ్వాలంటే...
‘జన భారత్‌’
‘జయ భారత్‌’ అవ్వాలంటే...
4 2022 జూలై - సెప్టెంబర్
ఎదుర్కొంటోంది. అదుపు లేని ధరలు, రెక్కలొచ్చిన
ద్రవ్యోల్బణం, పాతాళానికి...డబ్బు విలువ,
ఆరుగాలం శ్రమించి పంట బకాయిల కోసం
చకోర పక్షుల్లా హాలికులు, నిరసన హక్కు తీవ్రవాద
కార్యకలాపాల మధ్య రేఖ మసకబారి హక్కులకై
పోరాడే శ్రామికులపై తప్పుడు కేసులు, కాలంచెల్లిన
చట్టాలతో రాజద్రోహాలు చేతులకు సంకెళ్లు వేసి
గొంతులను సమాధి చేసే రాజ్య క్రూరత్వానికి
బలవుతున్న పోరాటయోధులు ఉద్యోగుల,
కార్మికుల నిరసనలపై ఆర్డినెన్సులు సృజనాత్మకతపై
దాడి అధ్యక్ష తరహా పాలన సాగించే అత్యున్నత
కార్యాలయాలు గ్రామ పంచాయితీల హక్కులు
కాలరాసే ప్రభుత్వాలు ఒక్కటేమిటి పాలన అస్తవ్యస్తం
వ్యవస్థల తీరు చూసి నిస్సహాయ స్థితిలో ఓ తరం
ఇదే...ఇదే నేటి భారతం.
యువత శక్తిమంతమైనది. నవ సమాజ స్థాపన
అయినా... జాతిహిత నిర్మాణమైనా యువశక్తితోనే
సాధ్యం. దేశ సంపద, భవితకు పునాది... యువత.
ఏ దేశ పురోగమనంలోనైనా యువతరానిదే
కీలకపాత్ర. ‘ఇంక్విలాబ్‌ జిందాబాద్‌‘ అని దేశాన్ని
కదిలించిన భగత్‌సింగ్‌ 23 ఏళ్ల వయస్సులో... జై
హింద్..! అంటూ జన సామాన్యాన్ని సయితం
చైతన్యబాటలో కదిలించిన యువకిశో రాలు
ఎందరో 20 నుండి 30 సంవత్సరాల లోపే...
స్ఫూర్తిదాయకమైన పాత్ర నిర్వహించారు.
చెక్కుచెదరని ఆత్మ విశ్వాసానికి ప్రతీకగా యువత
ఉన్నప్పుడే ఏ జాతి భవిష్యత్తయినా ఉజ్వలంగా
వెలుగొందుతుంది.
గుండెల నిండా చేవ, కరాల నిండా సత్తువ
నిండియున్న యువత ఎక్కువగా వున్న దేశం
మనది. ఉత్తేజంలోనూ, ఉత్పత్తిలోనూ, ముందుం
డాల్సిన దేశం మనది. దేశంలో నేడు ఆ రకమైన
ఉత్పత్తి జరగడం లేదు. యువతలో ఆ ఉత్తేజమూ
లేదు. పాలకుల వైఫల్యాల కారణంగా యువతలో
శక్తిసామర్థ్యాలు ఉడిగిపోతున్న పరిస్థితి. దీనికి
తోడు... దేశంలో వ్యాపింపజేస్తున్న సాంస్కృతిక
కాలుష్యం కూడా యువతను పెడితోవ పట్టిస్తోంది.
భారతీయ సమాజం పురోగతి చెందాలంటే ధరల
పెరుగుదల, నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభం, తీవ్రమైన
ఆర్థిక అసమానతలు, పేదరికం లాంటి సమస్యల
పరిష్కారం కోసం తక్షణం శ్రద్ధ చూపాల్సిన
అవసరం ఉంది. ఈ సమస్యల పరిష్కారానికి
ప్రజల మధ్య సఖ్యత, ఐక్యత అవసరం. ఒక వైపు
భారతీయుల మధ్య ఐక్యతకు భంగం కలిగిస్తూ,
మరో వైపు భారత దేశ సమగ్రతను కాపాడాలని,
భారత దేశాన్ని విశ్వ గురువుగా నిలబెట్టాలని ఏ
దేశాభిమాని అయినా ఎలా ఆలోచించగలడు?
ప్రపంచంలో ప్రథమ స్థానానికి పరుగులు తీస్తూ
‘జన భారత్‌’ అనిపించుకుంటున్న మనం అదే నోట
‘జయ భారత్‌’ అనిపించుకొనే రోజూ రావాలి! మన
దేశానికి ఇప్పుడదే కావాలి!!
2022 జూలై - సెప్టెంబర్
అనగనగా ఓ రాజుగారు ఉండేవారు. ఆయన
అద్భుతమ
ై న, అందమ
ై న కోటలెన్నింటిలో నిర్మించాడు.
కానీ ఎందుకనో ఆయనకు తనివి తీరలేదు. ప
్ర పంచంలో
ఎక్కడా లేనటువంటి ఓ చిత
్ర మ
ై న మహలుని
నిర్మించాలనుకున్నాడు. శిల్పులందరూ వచ్చి తలా
ఓ నమూనాను చూపించారు కానీ ఏవీ రాజుగారికి
నచ్చలేదు. చివరికి ఓ శిల్పి చూపించిన అద్
దా లగది
నమూనా ఆయనకు నచ్చింది. పని కానియ్యమన్నాడు.
శిల్పి చూపించిన అద్
దా ల గది, అలాంటి ఇలాంటి
గది కాదు. ఆ గదిలోకి ఎవరన్నా ప
్ర వేశిస్
తే వారిని
ప
్ర తిబింబించేలా గదిలో అన్నివ
ై పులా అద్
దా లే! గది
ప
ై కప్పు, కింద గచ్చు కూడా అద్
దా లతోనే తయారుచేశాడు.
కంట్
లో నలుసు కూడా కని పించేంత స్పష
్ టంగా ఉన్నాయా
అద్
దా లు. లోపలికి ప
్ర వేశించిన మనిషికి తాను ఎక్కడ
నిల్చున్నాడో కూడా తెలియనంతగా నలుదిశలా కమ్ముకుని
ఉన్నాయి ఆ అద్
దా లు. అంతేకాదు! ఆ అద్
దా ల గదిలోని
శబ్
దా లు కూడా ఎంతో స్పష
్ టంగా ప
్ర తిధ్వనించేవి.
రాజుగారు నిర్మించిన ఈ కొత
్త మహలు గురించి
రాజ్యమంతా తెలిసిపోయింది. అందులోకి తొంగిచూసే
అదృష
్ టం తమకి ఎప్పుడు వస్తుందా అని ప
్ర జలు తెగ
ఎదురు చూడసాగారు.
ఓ రాత్రి అనుకోకుండా రాజుగారి కుక్క అందులోకి
ప
్ర వేశించింది. లోపలికి అడుగుపెట
్ట గానే దానికి
మతి పోయింది. తనలాంటి వందలాది కుక్కలు తనని
చుట్టుముట్టి ఉన్నాయి. ఈ మహలులో రాజుగారి
చెంతన ఉండే అర
్హ త తన ఒక్కదానికే ఉందనుకుందది.
ఆ కుక్కలను భయపెట
్ట డానికి ఒక్కసారిగా తన వాడి
పళ
్ల ను చూపించింది. చిత
్రం! అవి కూడా అలాగే తనని
భయపెట
్టేందుకు కోరలు చూపించాయి. యుద్
ధా నికి
సిద
్ధం అన్నట్లు గా ఒక్కసారి గట్టి గా మొరిగింది కుక్క!
దానికి నాలుగువ
ై పుల నుంచీ భీకరంగా శబ్
దా లు
ప
్ర తిధ్వనించాయి. ఇక తన చుట్
టూ ఉన్న కుక్కలతో
పోరాటం చేయక తప్పలేదు. గాల్
లో కి ఎగిరెగిరి పడుతూ,
లేని శత్
రు వులను ఉన్నారనుకుని అద్
దా ల మీద పడుతూ
నానా భీభత్సం సృష్టించింది.
ఉదయాన్నే అద్
దా ల గదిలోకి వచ్చిన భటులకి ఆ కుక్క
నిర్
జీ వంగా కనిపించింది. రాత
్రంతాతన ప
్ర తిబింబాలతో
పోరాటం చేసిన ఆ కుక్క ఓడి పోయింది. మన మనసు
కూడా అద్
దా ల గదిలాంటిదే! భయాలు నిజమవకుండానే
వాటితో తలపడుతూ ఉంటాము. లేనిపోని అనుమానాలతో
మనమీద మనమే పోరాటం చేస్
తూ ఉంటాము! కానీ
అందులో గెలుపుకి అవకాశం లేదు. ఉండేదల్లా ఓటమే!
అనురాగ గోపురాన్ని కాపాడే కొన్ని సూత్
రా లు
వివాహ బంధం బలంగా ఉండాలంటే అనురాగం
చూపించుకోవడం తప్పనిసరి. మనం బలంగా
ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం, నీళ్
లు క
్ర మంగా
అనురాగాన్ని పెంచుదాం!
అనుమానాన్ని త
్ర ుంచుదాం!!
కనువిప్పు కలిగించే ఓ పిట
్ట కథ
హయా తరన్నుమ్
2022 జూలై - సెప్టెంబర్
6 2022
తీసుకోవడం ఎంత ప్
రాముఖ్యమో, వివాహ బంధాన్ని
పోషించి బలపర్చుకోవడానికి క
్ర మంగా అనురాగం
చూపించుకోవడం కూడా అంతే ప్
రాముఖ్యం. పెళ
్ల యి
దశాబ్
దా లు గడిచినా, వివాహ భాగస్వామికి తన మీద
ఎంతో ప్
రే మ, శ
్ర ద
్ధ ఉన్నాయనే భరోసా భార్యకు/భర
్త కు
అవసరం.
నిజమ
ై న ప్
రే మలో స్వార
్ థం ఉండదు. నిజమ
ై న ప్
రే మ
ఎదుటివ్య
క్తి సంతోషాన్ని కోరుకుంటుంది. సాధారణంగా,
భర
్త ల కన్నా భార్యలు ఎక్కువగా అనురాగాన్ని
కోరుకుంటారు. భర
్త కు భార్య మీద చాలా ప్
రే మ
ఉండవచ్చు. కానీ ఆ ప్
రే మను కేవలం ఉదయం ఒకసారి,
సాయంత
్రం ఒకసారి, లేదా ల
ై ంగిక సంబంధానికి ముందు
మాత
్ర మే చూపిస్
తే , అసలు తన భర
్త కు నిజంగా తనమీద
శ
్ర ద
్ధ ఉందా అనే అనుమానం భార్యకు రావచ్చు. కాబట్టి
ప
్ర తీరోజు వీల
ై నప్పుడల్లా అనురాగం చూపిస్
తూ ఉండడం
మంచిది.
మాటల్
లో అనురాగం
చూపించండి. “ఐ లవ్‌ యు,” “నువ్వు నాకు దొరికిన
వరం” లాంటి చిన్నచిన్న మాటలు కూడా మీకు తనంటే
ఎంత ఇష
్ట మో మీ భార్యకు చూపిస్తా యి. “హృదయం
నిండా ఏముంటే నోరు అదే మాట్లా డుతుంది.”​ఓ ప్
రా చీన
నానుడి.మీఅనురాగాన్నిమాటలకేపరిమితంచేయాల్సిన
అవసరం లేదు. మీరు తనను ఎంతగా ప్
రే మిస్తు న్నారో రాసి
చెప్పండి, లేదా వాట్సాప్, టెలిగ్రా మ్, ఈ మెయిల్ మెసేజ్‌
పంపండి.
చేతల్
లో అనురాగం
కౌగిలించుకోవడం, గిల్
లి కజ్
జా లాడటం , లేదా ఊరికే
చేతులు పట్టు కోవడం లాంటివి మీరు నిజంగా తనను
ప్
రే మిస్తు న్నారు కాబట్టే “ఐ లవ్‌ యు” చెప్పారని మీ
భార్యకు తెలియజేస్తా యి. మృదువుగా తాకడం, ప్
రే మతో
చూడడం, అప్పుడప్పుడు బహుమతులు ఇవ్వడం ఇవన్నీ
నిజమ
ై న శ
్ర ద
్ధ ఉందని చూపిస్తా యి. అంతేకాదు, తనకు
సహాయం చేయడానికి మీరు బ్యాగులు మోయడం,
తలుపు తీసి ఉంచడం, గిన్నెలు కడగడం, బట
్ట లు
ఉతకడం, లేదా వంట చేయడం లాంటివి కూడా
చేయవచ్చు. చాలా సందర్భాల్
లో , ఈ పనులు చేయడం
ద్వారా మీరు తనకు సహాయం చేయడమే కాదు, మీ
అనురాగాన్ని చేతల్
లో చూపిస్తా రు! అంటే మనం మన
ప్
రే మను మాటల్
లో మాత
్ర మే కాదు చేతల్
లో చూపించాలి.
పెళ్
లి కాక ముందు పరిచయమ
ై న కొత
్త లో తనమీద ఎంత
శ
్ర ద
్ధ చూపించేవాళ్
లో ఇప్పుడూ అంతే శ
్ర ద
్ధ చూపించడానికి
ప
్ర యత్నించండి.
సమయంలో అనురాగం
మీ భర
్త /భార్య కోసం సమయం కేటాయించండి.
మీరిద
్ద రు కలిసి సమయం గడపడం వల
్ల మీ
వివాహ బంధం బలపడుతుంది, అంతేకాదు తనతో
సమయం గడపడం మీకు ఇష
్ట మని మీ భర
్త కు/
భార్యకు తెలుస్తుంది. నిజమే, మీకు పిల
్లలుంటే లేదా
ప
్ర తీరోజు చాలా విషయాల గురించి మాట్లా డుకోవాల్సిన
అవసరం ఉంటే, మీరిద
్ద రు కలిసి ఎక్కువ సమయం
గడపలేకపోవచ్చు. అలాంటప్పుడు కేవలం మీరిద
్ద రు
కలిసి కాసేపు వాకింగ్‌ చేసేలా ఏర్పాటు చేసుకున్నా
మంచిదే.
అభిరుచుల్
లో అనురాగం
మీ భర
్త /భార్య అభిరుచులు, కోరికలు, అవసరాలు
తెలుసుకోండి. అనురాగం కోరుకునే విషయంలో
ఒక్కో వ్య
క్తి అభిరుచులు ఒక్కోలా ఉంటాయి. మీరు
తనమీద ఎలా అనురాగం చూపించాలని మీ వివాహ జత
కోరుకుంటున్నారో, మీరు ఇంకా ఎక్కువ అనురాగం
చూపించాల్సిన అవసరం ఉందేమో ఒకరితో ఒకరు
మాట్లా డి తెలుసుకోండి. తర్వాత, తను కోరినట్టు
చేయడానికి కృషి చేయండి.
వివాహ బంధం బలంగా ఉండాలంటే అనురాగం
చూపించడం తప్పనిసరి అని గుర్తుంచుకోండి. మీ
వివాహ జతను మీ మీద అనురాగం చూపించమని
(మిగతాది 9 వ పేజీలో)
7
2022 జూలై - సెప్టెంబర్
ప్రతి మనిషీ గౌరవం కోరుకుంటాడు. మర్యాద
మన్ననలు పొందాలనుకుంటాడు. గుర్తింపు
లభించగానే ఉత్సాహం రెట్టింపు అవుతుంది.
మెప్పులు, అభినందనలు అందగానే మనసు
సంతోషంతో నిండిపోతుంది. అందరూ మెచ్చే
ఘనకార్యాలు చేసేందుకు మనసు పురి విప్పుతుంది.
రావాల్సిన సమయంలో గుర్తింపు రాకపోతే జీవనో
త్సాహంపై నైరాశ్యపు నీడలు కమ్ముకుంటాయి.
అడుగులు ముందుకు వెయ్యడం ఆగిపోతుంది.
ఇది మనసు నైజం. అందుచేత దాన్ని ఓ కంట
కనిపెడుతూ ఉండాలి. కోరిక నెరవేరలేదని వ్యక్తి
మీద లేదా వ్యవస్థ పైనా మనసు అలకబూనుతుంది.
అలా చేయడమూ ప్రతీకారం తీర్చుకోవడమే
అవుతుంది. అది ప్రాకృతిక ప్రామాణిక సూత్రాలతో
కూడిన ధార్మిక (సాధికారిక) జీవన విధానానికి
విరుద్ధం. చప్పట్లు, బహుమానాలు, పథకాలు,
పురస్కారాలు ఎదుగుదలను కాంక్షించే ఉత్ప్రేరకాలు.
అవి కృషిని కీర్తిస్తాయి, ప్రోత్సహిస్తాయి.
మరొకరికి స్ఫూర్తినిస్తాయి. అవి రానంత మాత్రాన
కుంగిపోకూడదు. - ఒక చిరునవ్వు, చిన్న
పలకరింపు- గౌరవించడం కిందకే వస్తాయి. అవి
మనుషుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందిస్తాయి.
మహానుభావులు ఎందరో ఉన్న వేదిక మీద
నుంచి ఓ గొప్ప వ్యక్తి మనల్ని పేరు పెట్టి పిలవడం
మన చెవులకు ఎంత ఇంపుగా ఉంటుంది. ఆ
క్షణాల్లో మనం ఎంత ఆత్మానందాన్ని లోనవుతాం!
రక్త సంబంధీకులు, బంధువులు, ఆత్మీయులు
శుభకార్యాల పేరిట మీ ఇంటికి వస్తే, ఇంటిల్లిపాది
ఎదురెళ్ళి ఘన స్వాగతం పలుకుతారు. అది
సామూహిక మర్యాద. కొందరు చెమ్మగిల్లిన
కళ్లతో హృదయాల్ని తాకుతారు. అది ఆత్మలు
పెనవేసుకున్న ఆలింగనం. నేలపై కూర్చున్నవాళ్లు
సైతం లేచి నిలబడినప్పుడే వచ్చిన అతిథికి గౌరవం
ఇచ్చినట్లు భావిస్తారు.
ఆత్మగౌరవం మనిషికి నిజమైన ఆభరణంలా
భాసిస్తుంది. ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని సొంతం
చేసుకుని, నమ్మిన సిద్ధాంతం కోసం, విలువలకోసం
రాజీ పడకుండా ముందుకు సాగే లక్షణానికి
మనం చెప్పుకునే అందమైన పదభూషణం ‘ఆత్మ
గౌరవం’. సమపాళ్ళలో కలిగి ఉండే ఈ లక్షణం
సమాజంలో అగణ్యత, అగ్రగణ్యత సంపాదిస్తుందో
లేదో తెలియదు కానీ, జీవన గమనానికి ఖచ్చితంగా
నిజమైన నాణ్యతను సంతరిస్తుంది. ‘‘ఆయనకు
ఆత్మగౌరవం చాలా ఎక్కువండీ.. ఎక్కడా రాజీ
పడకుండా జీవిస్తాడు’’ అనే మాటను మనం
కొంతమంది వ్యక్తులను ఉద్దేశించి, మిగిలినవాళ్ళు
మాట్లాడుకోవడం వింటూ ఉంటాం.
అహంకారం ఉన్నవారు తమ కోసం కాక,
ఎదుటివాళ్ల దృష్టిలో తాము గొప్పగా వున్నట్లుగా
భావన చేసుకుని జీవికను సాగిస్తారు. ఎవరైనా
తన గురించి తక్కువ, ఎక్కువల తేడా చూపిస్తే
చాలు, అవమానంతో రగిలిపోతారు. ప్రతీకార
భావంతో ఊగిపోతారు. మాటల తూటాలతో
పెట్రేగిపోతారు. అహంకారంతో ఉండేవాళ్ళు,
విలువల కోసం ప్రయత్నించక, పక్కవారి ముందు
ఉన్నతులుగా గుర్తింపబడాలని కోరుకుంటారు.
వీరిలో చెలరేగే అహంకారం వారిలో ఉన్న మంచిని
కూడా ఎదుటివారిని చూడనీయకుండా చేస్తుంది.
అహంకారంతో వర్తించడం ఎంత నేరమో,
ఆత్మగౌరవాన్ని చంపుకోవడం అంతకుమించిన
గౌరవం – ఆత్మ గౌరవం
గౌరవం – ఆత్మ గౌరవం
నదా ఫాతిమా
8 2022 జూలై - సెప్టెంబర్
దోషం.. నేరం!!
సమాజం తీరును మనం నిశితంగా పరికిస్తే,
అత్యాశలకు లోనైనప్పుడే, మనిషి జీవనశైలిలో
ఉన్న సమతౌల్యం దెబ్బ తింటుంది. అనవసరమైన
కోరికలనే గుర్రాలవెంట పరుగెడుతూ, వాటిని ఏ
విధంగానైనా తీర్చుకోవాలనే తపన ప్రబలినప్పుడే,
మనిషి తాను పాటించే విలువల విషయంలో,
ఆత్మను వంచన చేసుకునేలా రాజీపడి, ఎదుటివాడి
ముందు తలను వంచుతాడు. ఒకరకంగా దీన్నే నైతిక
పతనానికి నాంది అని చెప్పవచ్చు. ఎందుకు ఈ
అనవసరపు వెంపర్లాట..!!
మనం నమ్ముకున్న సూత్రాల విషయంలో
అవలంబించే రాజీ ధోరణి తాత్కాలికంగా
సుఖమయమనిపించినా, దీర్ఘకాలంలో తప్పనిసరిగా
మనకు మానసిక క్లేశాన్ని కలిగిస్తుందని ఎన్నో
ఉదాహరణలు తెలియజేస్తాయి.
ఎవరికీ తలవంచకుండా, అధికమైన ఆశలతో
ఎవరెవరినో ఆశించకుండా, దృఢమైన చిత్తంతో
సాగుతూ, నిండుగా నిలుపుకునే ఆత్మగౌరవమే
గుండెకు ఆనందరవం..!! జీవన వనాన
విరిసే ఆమనిలో అదే మధురంగా కిలకిలమనే
కోకిలారావం..!!
సంస్కారాలు, విలువలు, నియమాలతో కూడిన
జీవన ఆచరణ కలిగినవారు ఒకరి ముందు
తలవంచరు. దీనికి ధనంతో ఏమాత్రం పనిలేదు.
సంస్కారాలకు ఉన్న మహత్తరమైన విలువ
అలాంటిది. వీరు ఆదర్శ జీవనాన్ని జీవిస్తూ,
ఉన్నంత లో ఎదుటివాళ్లచేత గుర్తింపును,
గౌరవాన్ని పొందేవారుగా తమను తాము మలుచు
కంటారు. అలాంటి వారు తమకు తాము కొన్ని
హద్దులు పెట్టుకొని వాటిని దాటకుండా ఒక్కరిపైన
ఆధారపడకుండా ఆత్మగౌరవంతో నిరంతరం
జీవిస్తారు. తెలుగోడి ఆత్మ గౌరవం.. అన్న ఎన్టీఆర్‌
మాట ఎన్ని అద్భుతాలు చేసిందో ఉభయ రాష్ట్రాల
ప్రజలకు తెలియనిది కాదు.
ఒకరి నీడనిచూసి ఉలిక్కిపడుతున్న వారు కొందరు.
ఒకరి రాకను చూసి ముక్కు మూసుకుంటున్న
వారు కొందరు. ఒకరి రూపం చూస్తేనే దూరంగా
తొలగిపోతున్న వారు కొందరు. ఇలాంటి ఎన్నో
అవమానాలు, అస్పృశ్యతా ఆచారాలు, దౌర్జన్యాలు,
అత్యాచారాలు భరిస్తూనే తరాలు గడిచిపోయాయి.
గౌరవం, ఆత్మగౌరవంతో తల పైకెత్తనివ్వడం లేదు.
సమాజం ఆధునికంగా అభివృద్ధి అయ్యిందేమో కాని
అసమానతలు, కక్షలు, వివక్షలు నాటి నుండి నేటి
వరకు అలానే ఉన్నాయి.
అంటరానితనపు విషపుమొక్కని ఈ జీవ ధాత్రిలో
ఎవరు మొలకెత్తించారు? ఆస్పృశ్యతా కళంకంతో
దేశ చరిత్ర అంతా కాలుష్యభరితం ఎవరు చేశారు?
కులం కంపుతో, మతం చిచ్చుతో ఛీత్కారాలకులోనై
ఎందరో దురాచారాలకు, దురాగతాలను,
దుర్మార్గాలకు, దమననీతులకు, దహనకాండలకు
బలైపోయారు. ఊరులో ఉంటూనే ఊరికి
దూరమయ్యారు. తర తరాలుగా యుగాలుగా
అంటరాని పెనుమంటకి గురై మాడి మసి బారిన
బతుకులుగా మిగిలిపోయారు. ఈ పాపం ఎవరిది?
మనిషిది కాదా? ఇటువంటి దురాచారాలను దూరం
చెయ్యాల్సిన బాధ్యత మన మీద లేదా?
ఏ సమాజంలోనైనా ఏ భాషలోనైనా ఆనాటి సమాజ
వ్యవస్థను బట్టి సాహిత్య వికాసం జరుగుతుంది.
వికాసమన్నది సమాజాన్ని వేలు పట్టుకుని పురోగమ
నం వైపు తీసుకెళుతుంది. వ్యవస్థలో అనేక సమస్యలు
పద్యమై, గద్యమై, వచనమై, ప్రవచనమై, వ్యాసమై,
కవితయి ప్రశ్నించాయి, ప్రశ్నిస్తూనే ఉన్నాయి. లింగ
వివక్ష, కులవివక్ష, అసమానతలు, నిమ్నవర్గాలపై
అఘాయిత్యాలు, అత్యాచారాలు నేటికీ మనముందు
సవాళ్ళుగా మిగిలిపోయాయి. వారూ మనుషులే,
వారికీ మంసుంటుందని, వారికి మెదడుంటుందనీ,
వారి మనో భావాలు కూడా దెబ్బ తింటాయని
గ్రహించ గలిగిన నాడే, వారి ఆత్మ గౌరవాన్ని
గుర్తిస్తూనే, వారిని సాటి మనిషిగా గౌరవించిన నాడే
సమాజానికి, సంఘానికి, దేశానికి నిజమైన గౌరవం.
9
2022 జూలై - సెప్టెంబర్
వినండి! ఇహలోక జీవితం ఒక ఆట, తమాషా,
బాహ్య పటాటోపం, పరస్పరం బడాయి చెప్పుకొని
గర్వించడం, సంతానం, సిరిసంపదలలో ఒకర్నొకరు
మించిపోవడా నికి ప్రయత్నించడం తప్ప మరేమీ
కాదు. ఐహికజీవితాన్ని ఇలా పోల్చవచ్చు:
వర్షంతో ఎదిగిన మొలకల్ని చూసి రైతులు సంబర
పడిపోతారు. తర్వాత ఆ పొలం పంటకు వచ్చి
ఎర్రబారడం కన్పిస్తుంది. ఆ తర్వాత తుప్పగా
(గడ్డిపరకలుగా) మారిపోతుంది. (దివ్య ఖురాన్:
అల్ హదీద్ -20)
ఆటలో అన్ని అడ్డంకులను అధిగమించి చివరకు
విజయ లక్ష్యం సాధిస్తే విజేత అవుతారు.
అదేవిధంగా జీవితం ఒక ఆట, సుదీర్ఘ జీవితకాలం
ఒక మైదానంలో క్రీడా స్పూర్తితో ఆడాలి... పోరాడి
గెలవాలి. అయితే ఒక్క విజయం సిద్ధిస్తే ఆట
ఆగిపోదు. చివరి వరకు ఆడి విజయ పతాకాన్ని
ఎగురవేయాలి. జీవితంలో అనేక జయాలు, మరెన్నో
పరాజయాలు తటస్థించి ఆశ నిరాశలకు గురి
చేస్తాయి. ఇక నేను సాధించలేను ఓడిపోయాను
అనిపిస్తుంది. అప్పుడే ధైర్యం, ఆత్మ విశ్వాసం,
ఆశాభావం అవసరం.
పసి వయసులో ఎదుగుదల కఠోర పరిశ్రమ. పొట్టను
నేలకు ఆనించి ముందుకు పాకడం, మోకాళ్లమీద
చేతుల సహాయంతో సాగడం, కూర్చోవడం,
నిలబడటం, తడబాటు అడుగుల నడక, క్రమంగా
పరుగు... ఇవన్నీ మన -కాళ్ల మీద మనం నిలవాలనే
లక్ష్యంగా సాగే సాధనా ప్రక్రియలు. జీవితంలో ప్రతి
సన్నివేశం మనల్ని భయ పెడుతుంది. పరీక్షిస్తుంది.
నిలిచి గెలవగలమా అనే సందేహం కలుగుతుంది.
ధైర్యాన్ని నింపుకొని సముచిత దయం తీసుకుని
అడుగు ముందుకు వేస్తే విజయం తథ్యం.
ఆరంభింపరు నీచ మానవులు, ఆరంభించినా
మధ్యలో వదిలేవారు బలహీన మానవులు వారే
పరాజితులని భర్తృహరి పేర్కొన్నాడు. ఎన్ని కష్టాలు
ఎదురైనా లక్ష్యంతో సాగితే... విజయమాల
వరిస్తుంది. వారే ధీరులు, ఉత్తములని కీర్తించాడు.
పోటీతోనే ఆట సాగాలి. గెలవాలన్న పట్టుదల,
తెగింపు ఉండాలి. ఆట మైదానమైనా, జీవన
విధానమైనా... విజయ పతాకాన్ని ఎగురవేయాలి.
బాల్యంలో చదువుల్లో పోటీ; విషయాలు అర్థం
చేసుకుని పరీక్షలో అత్యున్నత స్థాయికి చేరి
ఉద్యోగంలో స్థిరపడేందుకు యువత ఆరాటం,
ఆశయం; ఎంచుకున్న వృత్తిలో అంచెలంచెలుగా
ఎదగాలనే వృత్తిధర్మం... ఇవన్నీ పోటీలే. వివాహం,
కుటుంబం... అన్నీ జీవిత రణరంగ విన్యాసాలు.
మనసును బలహీనపరచే పిరికితనం చంచలత్వం
వైపు మరల్చితే దిగజారడం తప్పదు. ధైర్యం,
పట్టుదల, నిరంతర కృషి వైపు మనసును మళ్ళిస్తే
విజయం తథ్యం. శ్రద్ధ ఓర్పు సహనం ప్రేమ- ఇవే
విజయ తీరాలకు చేర్చే దిక్సూచులు. క్షమించడం
పరాజయం పతనం కాదు...
అది విజయానికి పునాది
హమద్ ఖాలిద్
10 2022 జూలై - సెప్టెంబర్
వల్ల గతం మారకపోవచ్చుగానీ భవిష్యత్తు
మాత్రం మనకు అనుకూలంగా మారుతుంది.
పూల పరిమళం గాలి వాటుకే వెళుతుంది. మనిషి
మంచితనం మాత్రం ప్రతి దిక్కుకు ప్రసరిస్తుంది.
ప్రపంచంలో మనకు వేరే శత్రువులు కానీ..
మిత్రులు కానీ ఉండరు. మన నడవడికే మిత్రులను,
శత్రువులను సంపాదించి పెడుతుంది.
పరాజయాలు జీవితంలో సహజం అనే సమస్థితి
సాధించాలి. రోదనలతో వేదన చల్లారుతుంది కానీ
విజయం లభించదు. పడిన చోటు నుంచే పైకి
లేవాలి. ఓడిన చోట గెలుపు సాధించాలి. శిఖరాన్ని
ఎక్కేప్పుడు ప్రతి అడుగూ జాగ్రత్తగానే వేయాలి,
ఎందుకంటే ఒక తప్పటడుగు మనల్ని పాతాళానికి
పడేయవచ్చు. ఓటమి అంచున నిలబడిన వారూ
గెలుపు తీరాలకు చేరారు. పరాజయం పతనం
కాదు... అది విజయానికి పునాది, సూర్యోదయాన్ని
తెచ్చే ఉదయ సంధ్య, ఉన్నత స్థాయికి చేర్చే తొలి
మెట్టు.
ఓర్పు ఎప్పటికీ బలమే. బలహీనత ఎంత మాత్రం
కాదు. మన ప్రయత్నాలన్నీ విఫలమైనప్పుడు,
మరింత ఓర్పు తో ప్రయత్నిస్తే అనితర సాధ్యమైన
విజయాలు సాధించవచ్చు, ‘ఓరిచితే తనపంతం
ఊరకేవచ్చు; అంటారు. ఓర్పు వహిస్తే మన
పట్టుదలలన్నీ తప్పక నెరవేరతాయని భావం.
మన ప్రతిభ, సామర్ధ్యం పట్ల ఆత్మ విశ్వాసం
కాకుండా, అతి విశ్వాసం ఉంటే, తక్షణం వాటిని
మొహమాటం లేకుండా, ఆత్మ విమర్శతో
విశ్లేషణ చేసుకోవాలి. మన ఆలోచనలకంటే
విభిన్నంగా మన లక్ష్యాలు ఎందుకున్నాయో
అవగాహన చేసుకుని, సాధించగలిగిన లక్ష్యాలను
ఏర్పరచుకోవాలి. జయాపజయాలు పగలు, రాత్రి
లాంటివి. ఒక దానినొకటి వెంబడిస్తాయి. ఒక
అంశంలో మనకు అపజయం ఎదురైతే, మరో
లక్ష్యంతో విజయం సాధించవచ్చు.
అడిగే బదులు, ‘నా భర
్త /భార్య నా మీద ఇంకా
ఎక్కువ అనురాగం చూపించాలంటే నేనేం
చేయాలి?’ అని ఆలోచించండి.
సాధారణంగా ఒక వ్య
క్తి ఎన్ని పెద
్ద పెద
్ద పదవుల్
లో
రాణించినా ఇంటిలో తన బలహీనతలు బయట
పడుతుంటాయి. అవి తన యింటి వారికి ఇంటిలో
పనివారికి తెలుస్తుంటాయి. అలాగే ఆ వ్య
క్తి యొక్క
వ్య
క్తి త్వం, అతనిలోని మానవత్వం, సేవాగుణం
కూడ బయటవారి కన్నా ఇంటి వారే ఎక్కువ
గుర
్తించగలుగుతారు. ఎందుకంటే తాను ఓ ఇంటి
యజమాని గా ఇంటివారందరిప
ై న ఆధిపత్యం
చెలాయించే హక్కు కలిగిఉంటాడు. ఆధిపత్యం,
అధికారం ఉన్నప్పుడే బలాలు, బలహీనతలన్నీ
బయట పడతాయి అన్నది ఓ ప్
రా చీన నానుడి.
కనుకనే ‘‘ఒక వ్య
క్తి నిజ స్వరూపం తెలుసుకోవాలంటే
అధికారమిచ్చి చూడు’’ అన్నారు వెనుకటికి పెద
్ద లు.
అయిషా (రజి.అ) వారిని కొందరు ముహమ్మద్ (స)
వారు ఇంటిలో ఎలా ఉండేవారు అని ప
్ర శ్నించారు.
అప్పుడు వారు ఇలా సమాధానం ఇచ్చారు: ఆయన ఓ
సాధారణ వ్య
క్తి లానే ఇంట్
లో మసలేవారు. తన బట
్ట లు
తానే సర్దు కునేవారు. మేకల నుండి పాలు పితికేవారు.
మా.పనులలో సహకరించేవారు అని అన్నారు.
(తిర్మిజి)
ముహమ్మద్ (స) వారి కోసం అన్నీ వదులుకునివచ్చిన
ఎందరో సహబీలు ఆయన ఏది కోరితే అది
తెచ్చిపెట్టే సహచరులు ఉన్నప్పటికి ఆయన ఓ
సాధారణ జీవితాన్నే గడిపేవారు. ఎన్నో రాత్
రు లు
అర్
ధా కలితో పడుకునేవారు. ఏనాడూ ఆర్భాటాలకు,
అహంకారాలకు గొప్పలకు పోలేదు.
(అనురాగాన్ని పెంచుదాం ...
5 వ పేజీ మిగతా భాగం)
అనురాగాన్ని  పెంచుదాం!           
అనుమానాన్ని త్రుంచుదాం!!
2022 జూలై - సెప్టెంబర్
12 2022 జూలై - సెప్టెంబర్
ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)ను
అంతిమ దైవప్రవక్తగా విశ్వసించడం ఈమాన్
మూల విశ్వాసాలలో ఒకటి. దీనిపైనే ఒక విశ్వాసి
విశ్వాసం ఆధారపడి ఉంటుంది. ఏ వ్యక్తయితే దైవ
ప్రవక్త (స)ను విశ్వసించడో అతను విశ్వాస పరిధుల
నుండి దూరమై అవిశ్వాసుల్లో చేరుతాడు. అలాగే
దైవ ప్రవక్త కాని వ్యక్తిని దైవ ప్రవక్తగా భావించి
విశ్వసిస్తే అలాంటి వ్యక్తి కూడా అవిశ్వాసి అవుతాడు.
ఇస్లాం ధర్మంలోని కీలకమైన, సూక్ష్మమైన సిద్ధాం
తాలను పవిత్ర ఖుర్ఆన్ లో అల్లాహ్ క్లుప్తంగా
తెలియజేశాడు. వాటిని మహా ప్రవక్త ముహమ్మద్
(సల్లల్లాహు అలైహి వసల్లం) హదీసులో విశదీ
కరించారు. ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి
వసల్లం) తర్వాత మరో ప్రవక్త వచ్చే ప్రసక్తే లేదు ‘దైవ
ప్రవక్తల పరంపర’పై విశ్వాసమనేది ఎంతో కీలకమైన
విషయం. దీనిపై పూర్తి ముస్లిం సమాజం (ఉమ్మత్)
మధ్య ఏకాభిప్రాయం ఉంది. అందుకే ఏ వ్యక్తయినా
సరే ప్రవక్త ముహమ్మద్ (స)ను, చిట్టచివరి ప్రవక్త
అని విశ్వసించిన తరువాతే అతని విశ్వాసం పరిపూర్ణ
మవుతుంది. ఒక వేళ ఎవరైనా ప్రవక్త (స) ను
చిట్టచివరి సందేశహరునిగా అంగీకరించకపోతే ఆ
వ్యక్తి ఇస్లాం ధర్మం నుండి బహిష్కరించ బడతాడు.
ఎందుకంటే అల్లాహ్ పవిత్ర ఖుర్ఆన్లో ఇలా స్పష్ట
పర్చాడు: “ప్రజలారా! ముహమ్మద్ (స) మీ పురుషు
ల్లో ఎవరికీ తండ్రి కాడు. అయితే ఆయన అల్లాహ్
సందేశహరుడు, ప్రవక్తల పరంపరను పరిసమాప్తం
చేసే (చివరి) వాడు”. (అల్ అహ్ జాబ్-40)
పై ఆయత్ లో ముహమ్మద్ (స) ను ప్రవక్తల
పరంపరను సమాప్తం చేసేవారిగా చెప్పటం
జరిగింది. దాని కొరకు ప్రత్యేకంగా “ఖాతమున్”
అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. “ఖాతమ్”
అంటే “సీలు’ అని అర్ధం. ఒక పనిని పూర్తి చేసిన
అంతిమ దైవ దౌత్యాన్ని విశ్వసించటం
ద
ై వదౌత్య పరిసమాప్
తి
ద
ై వదౌత్య పరిసమాప్
తి
ద
ై వదౌత్య పరిసమాప్
తి
డా. సయీద్అ హ్మద్ మదనీ
13
2022 జూలై - సెప్టెంబర్
తరువాత చివరగా ‘సీలు’ (ముద్ర) వేయడం
జరుగుతుంది. అంటే ఆ పని చివరి వరకూ
పూర్తయినట్లే. ఉదాహరణకు పవిత్ర ఖుర్ఆన్ ను
ప్రారంభం నుండి చివరి వరకు చదవడాన్ని "ఖత్
ముల్-ఖుర్ఆన్” (ఖుర్ఆన్ పూర్తి చేయటం)
అంటారు. (లిసానుల్ అరబ్, నిఘంటువు)
పై వాక్యాల ద్వారా ప్రవక్తల పరంపర సమాప్తమైందని
తెలుస్తుంది. అంతేకాకుండా దీనిపై వాదోపవాదాలు,
ఘర్షణలు కూడా అనర్ధమని తెలుస్తోంది. ఎందుకంటే
పవిత్ర ఖుర్ఆన్, హదీసుల్లో ప్రస్తావన వచ్చిన
తరువాత వాటిని విస్మరించి మరో మార్గాన్ని
అనుసరించడం అజ్ఞానం, మార్గ భ్రష్టత్వం అవుతుంది.
ప్రవక్తల పరంపర పరిసమాప్తికి సంబంధించిన కొన్ని
హదీసులను పరిశీలిద్దాం :
1. అల్లాహ్ అంతిమ ప్రవక్త (స) ఈ విధంగా
తెలిపారు: “బనీ ఇస్రాయీల్ కు ప్రవక్తలు
నాయకత్వం వహించారు. ఒక ప్రవక్త మరణిస్తే ఆ
తర్వాత మరో ప్రవక్త ప్రాతినిధ్యం వహించేవారు.
అయితే నా తరువాత ప్రవక్తలుండరు, ఖలీఫాలు
మాత్రమే ఉంటారు.” (బుఖారి: కితాబుల్ మనాఖిబ్)
2. దేవుని అంతిమ ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు
: “నాకు ఆరు విషయాలలో మునుపటి ప్రవక్తలపై
ఆధిక్యత ఇవ్వబడింది.
1) నాకు సమగ్రమైన విషయాన్ని సంక్షిప్తంగా చెప్పే
నేర్పు వొసగబడింది.
2) గాంభీర్యం ద్వారా నాకు సహాయం
అందజేయబడింది.
3) యుద్ధ ప్రాప్తి నా కొరకు ధర్మసమ్మతం
చేయబడింది.
4) నా కొరకు సమస్త భూమి సజ్జా చేసే స్థలంగా
మరియు పవిత్రంగా చేయబడింది.
5) నన్ను సమస్త జాతుల వైపునకు ప్రవక్తగా చేసి
పంపటం జరిగింది.
6) నాతో దైవ దౌత్యం పరిసమాప్తం చేయబడింది.
(సహీహ్ ముస్లిం, తిర్మిజి, ఇబ్ను మాజా)
3. అల్లాహ్ అంతిమ ప్రవక్త (స) ఇంకా ఇలా
సెలవిచ్చారు: “నేను ముహమ్మద్ ని, అహ్మద్,
మాహీని, నా ద్వారా (కుఫ్ర్) తుడిచిపెట్ట బడుతుంది.
నేను ‘హాషిర్’ని. నా తరువాత ప్రజలు ‘హషర్’
మైదానంలో సమీకరించబడతారు. మరియు నేను
‘ఆఖిఖ్’ (సమాప్తుడను). నా తరువాత ఏ ప్రవక్తా
రారు”. (సహీహ్ బుఖారి, కితాబుల్ ఫజాయిల్)
4. ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: “నేను ప్రవక్తల్లో
చిట్టచివరి వాడను, నా మస్జిదు చిట్టచివరి మస్జిదు”.
(ముస్లిం, కితాబుల్- హజ్జ్)
ఒక ఉపమానం
5. అల్లాహ్ అంతిమ ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు:
“మునుపటి ప్రవక్తల మరియు నా ఉదాహరణ
ఎలాంటి దంటే ఒక వ్యక్తి తన భవనాన్ని ఎంతో
సుందరంగా నిర్మించాడు, కానీ.. ఒక మూల ఒక
ఇటుక స్థలాన్ని ఖాళీగా వదిలేసాడు. ప్రజలందరూ
ఆ భవనాన్ని సందర్శించి మంత్రముగ్దులయ్యే వారు
. కాని ఆ ఖాళీ స్థలాన్ని చూసి ఆశ్చర్యపడేవారు. ఆ
స్థలంలో ఉండవలసిన ఇటుకను నేను. ఆ భవనం
మునుపటి ప్రవక్తలు. నేను ప్రవక్తల పరంపరను
సమాప్తం చేసేవాడిని”. (సహీహ్ బుఖారీ:
కితాబుల్-మనాఖిబ్)
6. అల్లాహ్ అంతిమ ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు:
“అల్లాహ్ ఏ ప్రవక్తనూ దజ్జాల్ ఉపద్రవం గురించి
ప్రస్తావించకుండా, భయపెట్టకుండా పంప లేదు.
కానీ వారి కాలంలో ‘దజ్జాల్’ రాలేదు) ఇప్పుడు
నేను చిట్టచివరి ప్రవక్తను, మీరు చివరి సమాజం
వారు. ఖచ్చితంగా వాడు మీ సమాజంలోనే రావలసి
ఉంటుంది”. (ఇబ్న్ మాజా, కితాబుల్ ఫితన్)
(సశేషం)
ప్రవక్త ముహమ్మద్ (స) అన్నారు: "నా కంటి చలువ
నమాజులో ఉంచ బడింది"
(నసాయీ, ముస్నద్ అహ్మద్)
ఇస్లాం ధర్మం మరియు ముహమ్మద్ ప్రవక్త
(స) ప్రపంచానికి అందజేసిన సందేశం
మహత్తర సందేశం. ఆయన నడిపిన ఉద్యమం ఓ
మహాజ్వలమయిన సంస్కరణోద్యమం. అయితే
ఈ ఉద్యమం ప్రపంచానికి కొత్తదేమి కాదు. ఈ
ఉద్యమాన్నే అల్లాహ్ ప్రభవింపజేసిన ప్రవక్తలందరూ
ప్రతి యుగంలో ప్రతి దేశంలో నడిపారు. ఈ
ఉద్యమం కేవలం ఆధ్యాత్మిక రంగాన్నే కాక
మానవ జీవితానికి సంబంధించిన ప్రతి విభాగాన్ని
అపురూపంగా, అద్వితీయంగా తీర్చిదిద్దింది. ఇది
ఆధ్యాత్మిక, నైతిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ
రంగా లను పరివేష్టించిన సర్వతోముఖమైన
ఉద్యమం. మానవ జీవితపు ఏ ఒక్క రంగమూ దీని
పరిధికి వెలుపల లేదు.
ఇస్లామీయ ఉద్యమాన్ని అర్ధం చేనుకునేందుకు
దోహదపడే గ్రంథాలు ఎన్నో వున్నాయి. వీటి
ద్వారా ఇస్లామీయ ఉద్యమం ప్రస్ఫుటంగా
పరిచయమవుతుంది. కాని ఏ గ్రంథం చదవకుండా
ఏ పుస్తకం తిరిగేయకుండా, పెదవులను కదపకుండా
ఇస్లాం ధర్మాన్ని పరిచయం చేసే ఓ నిశ్శబ్ద
సదాచారం వుంది. మనుషులను నీతిమంతులుగా
సుశిక్షితులుగా చేసి వారి జీవితాలను పవిత్రంగా
మలచడమే దీని లక్ష్యం. మానవాళిని తొలచి
వేస్తున్న అనేక రుగ్మతల్ని దూరం చేసి, మానవుడు
నిజమయిన సాఫల్యాన్ని పొందే పురిపూర్ణమయిన
జీవన వ్యవస్థను అతనికీ అందజేయడమే దీని
కర్తవ్యం. దీన్నే ‘సమాజ్ సలాత్, ప్రార్ధన అంటారు.
ఈ ఆచరణ మనిషి ఐహిక జీవితాన్ని సుఖమయం
చెయ్యడమేకాక అతని పరలోక జీవితాన్ని ఫలవంతం
చేస్తుంది. ఈ సదాచారం చూపే జీవన పథాన్ని
అవలంబిస్తే ముప్పులన్నింటి నుండి విముక్తి
పొందుతాడు. మానవుడు.
సూర్యుడు వాలినప్పటి నుండి రాత్రి పొద్దుపోయే
వరకు నమాజ్‌ వ్యవస్థ స్థాపించు. వేకువజామున
కూడా ఖుర్‌ఆన్‌ పఠనం చేస్తూ ఉండు. వేకువ
జాము ఖుర్‌ఆన్‌ పఠనం (దైవదూతల) సాక్ష్యానికి
కారణమవుతుంది. రాత్రివేళ తహజ్జుద్‌ నమాజ్‌
కూడా చేస్తూ ఉండు. ఇది నీకోసం అదనపు
నమాజ్‌గా నిర్ణయించబడింది. నీ ప్రభువు నిన్ను
త్వరలోనే అత్యున్నతమైన స్తుతిస్థానం మీద అధిష్ఠింప
జేయవచ్చు. (దివ్య ఖురాన్: బనీ ఇస్రాయీల్ -78-
నేత్
రా నందానికి
నెలవు నమాజు
అబూ హనాన్
14 2022 జూలై - సెప్టెంబర్
79) ఈ ఆయతులలో అయిదు పూటల ప్రార్థన
ప్రస్తావన ఉంది. క్రమం తప్పకుండా నమాజుని
వేళకు చదివితే అత్యున్నతమైన స్తుతిస్థానం
ఇవ్వబడుతుంది అన్న వాగ్దానమూ ఉంది. తహజ్జుద్‌
నమాజ్‌ ప్రాశస్త్య ప్రస్తావనా ఉంది.
సాకులు చెప్పడం మానాలి
ఈనాడు ఎందరో ముస్లిం సహోదరులు
తమ నమాజుల పట్ల అశ్రద్ధ వహించడంతో
పాటు, నమాజునే ఓ బరువుగా, తమ స్వేచ్ఛా
స్వాతంత్ర్యాలకు వేసిన సంకెళ్లుగా భావిస్తున్నారు.
వీరి ముందు సమాజ ప్రస్తావన వచ్చినప్పుడల్లా,
విసుగు చెందడమో, సాకులు వెతకడమో చేస్తారు.
ముఖ్యమయిన పని వుందనీ, తప్పించుకోవడమో
స్నానం చెయ్యలేదనో, దుస్తులు పరిశుభ్రంగా లెవనో
అంటుంటారు. నిజానికి ఇవన్నీ పసలేని మాటలు.
ఆ తర్వాత అనర్హులు, అయోగ్యులు వారికి
వారసులైపోయాలు. వారు నమాజ్‌ని వదిలేసి
మనోవాంఛలకు బానిసలై పోయారు. త్వరలోనే వారు
తమ మార్గభ్రష్టత్వానికి తగిన శిక్ష అనుభవిస్తారు.
(దివ్య ఖురాన్: మర్యమ్ - 59)
అయితే పశ్చాత్తాపం చెంది, సత్యాన్ని విశ్వసించి
సదాచార వైఖరి అవలంబించేవారు మాత్రం
స్వర్గంలో ప్రవేశిస్తారు. వారికి అణుమాత్రం కూడా
అన్యాయం జరగదు. అనంత కరుణామయుడు, తన
దాసులకు వాగ్దానం చేసిన, అగోచర జగత్తులోని
శాశ్వతమైన స్వర్గవనాలు. ఆ వాగ్దానం తప్పకుండా
నెరవేరుతుంది. (దివ్య ఖురాన్: మర్యమ్ - 60-61)
కొందరైతే మరీ దారుణం - అల్లాహ్ ఆదేశాలను
బహిరంగంగా వ్యతిరేకించడమే కాక, అల్లాహ్
ఆజ్ఞలపట్ల వినయ వినమ్రతలు ప్రదర్శించే వారిని
హేళన చేస్తారు. వారు అనాగరికులని, ఆటవికులని
వెక్కిరిస్తారు.
మీరు మాట్లాడుతున్నదేమిటని అడిగితే "మేమేదో
పరిహాసంగా అంటున్నాము” అంటారు వారు. వారికి
చెప్పు: “మీరు అల్లాహ్ తో, ఆయన సూక్తులతో,
ఆయన ప్రవక్త తోనా పరిహాసమాడేది? ఇకనైనా
సాకులు చెప్పడం మానుకోండి. మీరు సత్యాన్ని విశ్వ
సించిన తర్వాత తిరస్కార వైఖరి అవలంబించారు.
మేము మీలో కొందరిని క్షమించినా మిగిలినవారిని
మాత్రం తప్పకుండా శిక్షిస్తాం. వారు పరమ
దుర్మార్గులు".(దివ్య ఖురాన్: తౌబహ్ - 65-66)
వీరికి ఏమయ్యింది అల్లాహ్ పట్ల భయంతో
రాళ్ళు సయితం ద్రవిస్తాయి. వీరి హృదయాలు ఆ
రాళ్ళకన్నా గట్టిగా ఉన్నాయా? జీవరాసులలో కెల్లా
వీరు విచిత్రమయినవారు. అల్లాహ్ ఆదేశాలను
వింటున్నారు. ఆయన ధరిత్రిపైనే నివసిస్తున్నారు.
ఆయన ఇచ్చిందే తొడుగుతున్నారు. ఆయన
ప్రసాదించిందే తింటున్నారు. ఆయన పైనే ఆధారపడి
జీవిస్తు న్నారు. కాని ఆయన ఆదేశాలనే ధిక్కరిస్తు
న్నారు. ఆయన ఆజ్ఞలనే జవదాటుతున్నారు. "అసలు
వారికేమయింది, ఈ హితబోధ నుండి ముఖం
త్రిప్పుకుంటున్నారు."
(దివ్య ఖురాన్: ముద్దస్సిర్- 49-51)
నమాజు అంటే జరిమాన కాదు
నమాజు జరిమాన ఎంత మాత్రం కాదు.
పరిహారమూ, పన్ను అంతకన్నా కాదు. ఇది ముస్లిం
సమాజానికి అప్పగించబడిన ఓ దివ్య అమానతు.
దీన్ని మనిషి రోజు ఐదు సార్లు చూస్తూ, దీన్ని
సంరక్షణకు కావలసిన కట్టుదిట్టమయిన చర్యలు
తీసుకుంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే మనం
నీతిమంతులమనీ, సచ్చిలత గల వ్యక్తిలమనీ,
నిజాయితీ పరులమనీ, నిష్కల్మష హృదయులమనీ,
సత్య సంధులమనీ హక్కులను రక్షించేవారలమనీ,
దయార్ద్ర హృదయులమనీ, శ్రేయోభిలాషులమనీ,
మన నమాజు చెప్పకనే చెబుతుంది. తోడుగా క్రమం
తప్పకుండా పాటించే వ్యక్తిని గొప్పగా నన్మానించడం
జరుగుతుందన్న శుభ వార్తను కూడా అందజేస్తుంది.
రాత్రి చీకటిలో మస్జీద్ వైపు నడిచే వెళ్లేవారికి
15
2022 జూలై - సెప్టెంబర్
నేనిస్తున్న శుభవార్త - రేపు ప్రళయ దినాన వారికి
సంపూర్ణమైన జ్యోతులు ఇవ్వఫ్వబడతాయి. అన్నారు
ప్రవక్త (స). (తిర్మిజీ)
విశ్వాసులు తప్పకుండా కృతార్థులవుతారు.
(వారి గుణగణాలు ఇలా ఉంటాయి) వారు తమ
నమాజులో ఎంతో అణుకువ, నమ్రతలు పాటిస్తారు.
పనికిమాలిన విషయాలకు చాలా దూరంగా
ఉంటారు. తమ సంపద నుండి (పేదల ఆర్థిక
హక్కు) జకాత్‌ చెల్లిస్తారు.
వారు తమ భార్యలు, బానిసస్త్రీల విషయంలో తప్ప
(ఇతరస్త్రీల విషయంలో) తమ మర్మావయవాలు
కాపాడుకుంటారు. (అంటే వ్యభిచారం తదితర
అశ్లీల చేష్టలకు పాల్పడరు.) .... వారు తమ
అప్పగింతలు, ప్రమాణాలు, ఒప్పందాల
విషయంలో నిజాయితీగా వ్యవహరిస్తారు. తమ
నమాజులను క్రమం తప్పకుండా, నియమబద్ధంగా
పాటిస్తారు. అలాంటివారే మహోన్నత స్వర్గానికి
వారసులవుతారు. అక్కడే వారు కలకాలం
(హాయిగా) ఉంటారు.
(దివ్య ఖురాన్: మోమినూన్ - 01-11)
అల్లాహ్ అపార అనుగ్రహాలు మనకు ప్రసాదించ
బడ్డాయి అనడానికి తార్కాణమే నమాజు. విశ్వ
ప్రభువయిన అల్లాహ్ కు పూర్తి సమర్పణయే
నమాజు. తనకన్నా పై హోదాలో వున్న వ్యక్తుల్ని
క్రింది ఉద్యోగులు గౌరవిస్తున్నట్లు మనం ప్రతిరోజు
చూస్తువుంటాము. సంతోష ఘడియల్లో విందు
ఇవ్వడం, కష్ట సమయాల్లో వారి సహాయాన్ని
కోరడం, వారిలోని పుణ్య పురుషుల రాక
శుభప్రదమని భావించడం, వారిలోని మేధావుల
పేర్లు తమ సంతానానికి పెట్టి సంతోషించడం
మనం గమనిస్తూ ఉంటాము. హోదా సంపద
గలవారు ఏకాస్త అలిగినా వారిని బుజ్జగించడానికి
మనిషిపడే పాట్లు కూడా దైనందిన జీవితంలో మనం
గమనిస్తూనే వుంటాము.
కాని అదే మన నిజ ఆరాధ్య దైవం విషయానికి వస్తే
ఆయన సర్వలోక సృష్టికర్త, సార్వ భౌమాధికారి,
తూర్పు పడమరలకు స్వామి, ఆయన ఒక్కడేనని,
ఆయనకు భౌతిక ఆకారం లేదనీ, ఆయన అండ,
పిండ, -బ్రహ్మాండానికి అతీతుడనీ, ఆయన దేశ,
కాలాలకు పరిమితమయిన వాడు కాడని, ఆయనకు
సాటి సరిసమానమైన ఏ వస్తువు మరే ప్రాణీ ఈ
ప్రపంచలోనే లేదని తెలుసు. కానీ... సర్వలోక
ఉపాధి ప్రదాత అయిన అల్లాహ్ ను ఆరాధించడం.
మానవుణ్ణి అద్భుతమైన ఆకృతిలో సృజించిన
అధికారులందరికన్నా గొప్ప అధికారి అయిన
అల్లాహ్ ను వేడుకోవడం మనకు ఎందుకు భారంగా
తోస్తున్నట్లు? ఎందుకు మనం దానిని చెల్లించ
సాధ్యం కానీ పన్నులా భావిస్తున్నాము?
(సరే, మీకేవైనా ఇబ్బందులుంటే) సహనం, ప్రార్థనల
ద్వారా (నా) సహాయాన్ని అర్థించండి. ప్రార్థన
(నమాజ్‌) కాస్త కష్టమైన పనే, సందేహం లేదు. కాని
ఒకరోజు తమ ప్రభువును కలుసుకోవలసి ఉందని,
ఆయన సన్నిధికే మరలిపోవలసి ఉందని భావించే
దైవభీతిపరులకు మాత్రం ప్రార్థన (నమాజ్‌) చేయడం
కష్టమేమీ కాదు. (దివ్య ఖురాన్: బఖరః -45-46)
ఇహపరాల సాఫల్యం ఆ నిజ ప
్ర భు
చేతుల్
లో నేగా ఉంది.
(విశ్వాసులారా!) ఇలా ప్రార్థించండి: “దేవా!
(విశ్వ)సామ్రాజ్యాధిపతీ! నీవు తలచుకున్న వారికి
రాజ్యం ప్రసాదిస్తావు: తలచుకున్న వారి నుండి
రాజ్యాన్ని ఊడబెరుకుతావు. అలాగే నీవు కోరిన
విధంగా కొందరికి గౌరవ ప్రతిష్ఠలు అనుగ్రహిస్తావు;
మరికొందరిని పరాభవం పాల్జేస్తావు. అన్ని విధాల
మేళ్ళు నీ చేతిలోనే ఉన్నాయి. నిస్సందేహంగా నీవు
ప్రతి పనీ చేయగల శక్తిమంతుడవు. నీవే రాత్రిని
పగటిలోకి, పగటిని రాత్రిలోకి ప్రవేశపె డ్తున్నావు.
అలాగే నిర్జీవమైన దాన్నుండి సజీవమైనదాన్ని,
సజీవమైన దాన్నుండి నిర్జీవమైన దాన్ని వెలికి
తీస్తావు. నీవే తలుచుకున్న వారికి ఇతోధికంగా
ఉపాధినిస్తావు.” (ఖురాన్: ఆల్ ఇమ్రాన్ -26-27)
16 2022 జూలై - సెప్టెంబర్
అదే సమయంలో మిథ్యా దైవాల నిస్సహాయతను
కూడా కాస్త గమనించండి.
“మీ నమ్మిక నిజమైతే వాటిని మొరపెట్టుకోండి-
అవి మీ మొరలు ఆలకిస్తాయేమో చూద్దాం!
నడవటానికి వాటికేమైనా (సహజ సిద్ధమైన)
కాళ్ళున్నాయా? పట్టుకోవటానికి వాటికేమైనా
చేతులున్నాయా? పోని చూడ టానికి ఎమైనా
కళ్ళున్నాయా? వినడానికి వాటికేమైనా
చేవులున్నాయా?”
(దివ్య ఖురాన్: ఆరాఫ్: 194-195)
మానవులారా! ఒక ఉదాహరణ ఇస్తున్నాం వినండి.
మీరు అల్లాహ్ ను వదిలి ప్రార్థిస్తున్న మిథ్యా దైవాలన్నీ
కలిసి కనీసం ఒక ఈగనైనా సృష్టించదలచుకుంటే,
దాన్ని కూడా సృష్టించ లేవు. పైపెచ్చు ఆ ఈగ వాటి
దగ్గర్నుంచి ఏదైనా వస్తువుని ఎగరేసుకుపోతే ఆ
వస్తువుని సయితం అవి దాన్నుండి విడిపించుకోలేవు,
సహాయం కోరేవారు, సహాయం అర్ధించబడే వారు -
ఇద్దరూ బలహీనులే. (దివ్య ఖురాన్: హజ్: 72)
కృతజ
్ఞ తా భావానికి నిలువెత్
తు నిదర్శనం
నమాజు
అపార అనుగ్రహాలు ప్రసాదించిన మహోన్నతుడైన ఆ
పరమ దాతకన్నా, కృపాకరుడైన అల్లాహ్ కు మించి
ప్రపంచంలో ఏదైనా "వుందా! ఆయనే కదా నఖశిఖ
పర్యంతం మనల్ని తీర్చిదిద్దింది! ఆయనే కదా....
అందమైన ఆకారం మనకు ప్రసాదించింది. ఆయనే
కదా... లోపాలు లేకుండా మనల్ని మలచింది.
మంచి చెడులను వేరుపరిచే విచక్షణా జ్ఞానాన్ని
ప్రసాదించినవాడు ఆయనే కదా!`లెక్కలేనన్ని,
లెక్కించ సాధ్యం కాని వరానుగ్రహాలను, ఊహ
కందని ఉపాధిని మనకు ఇవ్వడంతోపాటు
మనల్ని ఆరోగ్యవంతులుగా చేశాడు. ఆధ్యాత్మికంగా
మార్గ దర్శకత్వం వహించాడు. ఆలూ బిడ్డల్ని
ఇచ్చి మనల్ని ఆనందపరిచాడు. శాంతి నిలయం
లాంటి ప్రదేశంలో మనల్ని నివశింపజేశాడు. శాంతి
ప్రియులైన ఇరుగు పొరుగు వారిని కల్పించాడు,
మరి ఇలాంటి మహిమాన్వితుడికి మనం కృతజ్ఞతలు
తెలుపుకోవటం ధర్మం కాదా? ఆయన్ని మించిన
కరుణ కటాక్షాలు గలవాడు మరెవడయిన ఉన్నాడా?
లేడు. ముమ్మాటికి లేనే లేడు.
నిస్సందేహంగా బహుమానపు విలువని బట్టి
కృతజ్ఞతలూ వుంటాయి. మనకు ప్రాప్తమయి ఉన్న
సమస్తమూ అల్లాహ్ ప్రసాదితమే అయినప్పుడు
మనం ఎంతగా ఆయనకు కృతజ్ఞులమై ఉండాలో
ఆలోచించండి! మన జీవన్మరణాలు ఆయన
చేతిలోనే ఉన్నప్పుడు మనం ఆయనకు ఎంతగా
భయ పడాలో ఆత్మ సమీక్ష చేసుకోండి! "నా
కంటి చలువ నమాజులో ఉంచ బడింది" అని దైవ
ప్రవక్తల నాయకులు, సుభక్తాగ్రేసరుల్లో అగ్రజులు
అయినా మహనీయ ముహమ్మద్ (స) అంటుంటే,
మనం మన కంటి చలువను అరచేతి అనర్థాల
పుట్టయిన చరవాణిలో వెతుక్కుంటున్నాము. ఉన్న
ఆస్తిని, వ్యాపారాన్ని, ప్రాపంచిక భోగభాగ్యాలను
మన నేత్రానందంగా భ్రమించి బతుకుతున్నాము.
ఇది దేనికి తార్కాణం? మన పురోగమనానికా?
తిరోగమనానికా?
అల్లాహ్ కు మనలో నచ్చే గుణం కృతజ్ఞతాభావం.
కనుకనే ఇలా తెలియజేశాడు. మీరు కృతజ్ఞులయి
వుంటే మీకు మరిన్ని వరాలు అనుగ్రహిస్తానని
కృతములయిపోతే నా శిక్ష అత్యంత కఠినంగా
ఉంటుందనీ మీ ప్రభువు మిమ్మల్ని హెచ్చరించాడు."
(దివ్య ఖురాన్: ఇబ్రాహీం- 7)
కాబట్టి మనం ‘’ప్రజలారా! నాపట్ల కృతజ్ఞతగా
సత్కార్యాలు చేయండి’’ అన్న అల్లాహ్ ఆదేశానికి
శిరసా వహిస్తూ . అయిదు పూటల నమాజును
క్రమం తప్పకుండా పాటించి ‘’నా దాసులలో చాలా
తక్కువమంది కృతజ్ఞులైన వారున్నారు.’’ (దివ్య
ఖురాన్: సబా- 12-13) అని అల్లాహ్ అన్న ఆ
అదృష్టవంతులు జాబితాలో చేరేందుకు శక్తి వంచన
లేకుండా ప్రయత్నిద్దాం! దేన్నయినా వాయిదా
వెయ్యొచ్చు కానీ నమాజును మాత్రం వాయిదా
వేయకూడదు ఆయన ఎరుకతో జీవిద్దాం!!
17
2022 జూలై - సెప్టెంబర్
‘పై చేయి (ఇచ్చే హస్తం) క్రింది చేయి (పుచ్చుకునే
హస్తం) కన్నా మేలైనది" అన్నారు మహనీయ
ముహమ్మద్ (స). (సహీహ్ నసాయీ)
మనం ఎవరికి పుట్టామన్నదే సమాజంలో మన
స్థానాన్ని నిర్ణయించకూడదు’ అంటే మనం ఏదోకటి
ఎవరొకరికి ఇవ్వడం అలవాటు చేసుకోవాలి..
జీవితంలో ఆనందం ఎప్పుడు లభిస్తుంది? ఈ
ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టమే.. కానీ
మనందరికీ అనుభవంలోకి వచ్చే ఆనంద మార్గం
ఒకటి ఉంది. అదే పొందటం.. మనం ఏదైనా
పొందినప్పుడు చాలా ఆనందిస్తాం.. మనం కొత్త
వస్తువు కొంటే చాలా ఆనందిస్తాం. ఎవరైనా మనకు
ఓ బహుమతి ఇస్తే చాలా ఆనందిస్తాం.. ఆ రోజంతా
సంతోషంగా ఉంటాం. అయితే మనకు అర్థం కాని
విషయం.. మనలో చాలా మందికి అనుభవంలోకి
వచ్చే ఓ విషయం ఉంది. అదే ఇవ్వడం.. అవును
ఇవ్వడంలోనూ ఆనందం ఉంటుంది. ఏదైనా
కష్టంలో ఉన్నవారికి సాయం చేస్తే మనస్సు
అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది. మరో
ముఖ్యమైన విషయం ఏంటంటే.. మనం ఎవరి వద్ద
నుంచి ఏదైనా పొందిన దాంతో వచ్చే ఆనందం
కంటే.. ఏదైనా ఇచ్చినప్పుడు పొందే ఆనందం చాలా
ఎక్కువ. అంతే కాదు.. అది చాలా గొప్పది కూడా.
కొందరికి కడుపు నిండితే పండుగ. మరికొందరికి
ఎదుటివారి కడుపు నింపితే పండుగ. తమ కోసమే
తాము అనుకుంటే అంతటితో జీవితం ఎలాగూ
అంతమైపోతుంది. ఇతరుల కోసమూ ఆలోచన
చేస్తే వారి కీర్తి మట్టి రేణువులున్నంత వరకు
అజరామరమవుతుంది. ఇక ఎవరైతే తమ కడుపు
నింపుకోవడానికి ఇతరుల కడుపు కొడతారో
అలాంటి వారి బతుకు దండగ. అలాంటివారికి
ముందుంటుంది (పరలోకంలో) మొసళ్ల పండగ.
ఎవరి వద్ద నుంచైనా బలవంతంగా లాక్కున్నప్పుడు,
ఆ అపరాధ భావం వెంటాడి మనశ్శాంతిని దూరం
చేస్తుంది తాను మనిషైతే. సంతృప్తినివ్వని సంపద
ఎంత ఉండి ఏం ప్రయోజనం? అని ఏదోక
నాడు పశ్చాత్తాపపడాల్సిన రోజు జీవితంలో
ఎదురవుతుంది.
మనలో ఇతరులకు ఏ విధంగా నేను
సహాయపడగలను అనే ఆలోచన మొదలైందంటే..
మనం జీవితంలో చాలా ఎదిగినట్టు.. మన జన్మ
సార్థకత దిశగా అడుగులు వేస్తున్నట్టు.. మనిషిగా
పుచ్చుకొనుటకంటే
ఇచ్చుట మేలు
శాంతి ప్రియ
18 2022 జూలై - సెప్టెంబర్
మనం ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్నట్టు. మనిషి
ఎప్పుడైనా సరే.. నా ఎదుగుదల ఇతరుల కోసం
అనే భావనతో ఉన్నత స్థితిని పొందుతాడు. అందుకే
ఒక్కసారి ఇతరులకు సహాయ పడి చూడండి..
అది ఎంత చక్కటి అనుభూతి కలిగిస్తుందో..!
అందుకే పెద్దలన్నారు - "ప్రార్థించే పెదవులకన్నా
సహాయం చేసే చేతులు మిన్న" అని. ఒక్క
మాటలో చెప్పాలంటే - ఇచ్చిపుచ్చుకోవడం ప్రతి
ఒక్కరి జీవితంలో సహజం. ఇవ్వడం ఆనందం,
తీసుకోవడంలో ఎక్కువ ఆనందం. పుచ్చుకోవడంలో
ఉన్న ఆనందానికి తృప్తి లేదు. ఇవ్వడంలో ఉన్న
ఆనందానికి సంతృప్తి ఉంటుంది.
ఆకలి గొన్న వారికి అన్నం, దాహం వేసిన
వారికి మంచి నీళ్ళు పొయ్యడం, పీజు కట్టలేని
వారికి డబ్బులు కట్టడం, వీలైనంతగా అందరినీ
ఉన్నతులుగా చేయాలి అనే ఆలోచనలు సమాజంలో
విస్తరించాల్సి ఉంది. ఎవరి దగ్గరనైనా సంపద
ఎక్కువగా ఉన్నదంటే అది సమాజం నుంచి
వచ్చిందే, పూర్వం నుంచి ఉన్నా! అదీ ఆ నాటి
సమాజం అందించిందే.
మనం తినే ఆహారం, ఉండే ఇల్లు, ధరించే వస్త్రం,
జీవితానికి ఉపయోగపడే విద్య, వినియోగించే
ప్రతి వస్తువు... ప్రకృతి నుంచి, ఇతరుల సహాయ
సహకారాలతో పొందుతాం. ప్రకృతి ద్వారా
దేవుడు ప్రతిఫలాపేక్ష రహితంగా సమస్త జీవరాశికి
లేదనకుండా అన్నీ సమకూరు స్తాడు. కాని, మనిషి
దొరికినంత దోచుకోవడమేగాని తిరిగి ఇవ్వడం బహు
తక్కువ. ప్రతిదీ పరుల నుంచి గ్రహించి ఇతరులకు
ఏమీ పంచనివాడు అసలైన స్వార్ధపరుడు.
ఇవ్వడమంటే ధనం మాత్రమే కాదు. ప్రతి ఒక్కరి
దగ్గర అమూల్యమైన ధనేతర సంపద చాలానే
ఉంటుంది. ఉదాహరణకు - స్నేహితుడికి మన
హృదయాన్ని. శత్రువుకు క్షమను. పెద్దలకు
గౌరవాన్ని, పిన్నలకు
అవ్యాజానురాగాన్ని,
యజమానికి విశ్వాసాన్ని,
అర్ధాంగికి అనురాగాన్ని,పిల్లలకు
వాత్సల్యాన్ని ఇవ్వాలి. వారికి చక్కటి ఆదర్శంగా
నిలిచి, తల్లిదండ్రులు మనల్ని చూసి గర్వపడేలా
నడుచుకోవాలి. మనకు మనం ఆత్మగౌరవాన్ని
ఇచ్చుకోవాలి. ఎవరికి ఏది ఇచ్చి తిరిగి పొందాలన్న
ఆశతో ఇవ్వకూడదు. ఇవన్నీ మన దగ్గర తరగని
సంపద. ఇచ్చేవాడిది ఎప్పుడూ పైచెయ్యే. పుచ్చుకొనే
వాడిది ఎప్పుడూ క్రింది చెయ్యే!
ఇవ్వగలిగినంత మాత్రాన అహంకారంతో
ఇవ్వకూడదు. ఇచ్చే మన గుణాన్ని బహిర్గతపరచిన
ఆ వ్యక్తికి, ఆ వ్యక్తిని పరీక్షగా మన వద్దకు పంపిన
అల్లాహ్ యెడల కృతజ్ఞతా భావంతో ఇవ్వాలి. అది
కూడా చేయలేని స్థితిలో ‘ఇతరులు మనకు ఏది
చేస్తే అప్రియమో అది ఇతరులకు చేయకుండా ఉంటే
చాలు.
ఇవ్వడం ఏదైనా కావచ్చు- డబ్బు, ప్రేమ, గౌరవం,
ప్రోత్సాహం... నిస్వార్థంగా ఇవ్వగలగడం ఒక గొప్ప
కళ అని అర్థమవుతుంది. సహజంగా ఈ కళ అంత
తేలిగ్గా అలవడదు. మనిషిది సహజంగా వసూలు
చేసుకునే స్వభావం. దాచిపెట్టుకునే మనస్తత్వం.
అవసరానికి సరిపడేవే కాదు, దాన్ని మించి ఎన్నో
రెట్లు దాచిపెట్టుకోవాలనే తాపత్రయం.
ప్రకృతి ద్వారా అల్లాహ్ ప్రాణికోటికి సూర్యరశ్మి
గాలి, నీరు, భూమి, వృక్షాలు, జంతువులు
మొదలైనవి అందించకపోతే ‘మనిషి’
ఎక్కడుండేవాడు, మనుగడ ఎలా సాగించేవాడు?
ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. మనిషి
చేసే దుష్కర్మలవల్ల భూకంపాలు, సునామీలు,
వరదలు లాంటి వైపరీత్యాలు దాపురిస్తున్నాయి.
జీవితంలో మనిషి ఇవ్వడం, ఇవ్వడంలోని శక్తినీ
గ్రహిస్తే అంతరంగంలో సంతుష్టిని ప్రశాంతతను
అనుభవించగలుగుతాడు.
2022 జూలై - సెప్టెంబర్
నెలవంక 2022 / Nelavanka
నెలవంక 2022 / Nelavanka
నెలవంక 2022 / Nelavanka
నెలవంక 2022 / Nelavanka
నెలవంక 2022 / Nelavanka

Weitere ähnliche Inhalte

Mehr von Teacher

నెలవంక - Telugu Magazine Ramadan -nelavanka
నెలవంక -  Telugu Magazine Ramadan -nelavankaనెలవంక -  Telugu Magazine Ramadan -nelavanka
నెలవంక - Telugu Magazine Ramadan -nelavankaTeacher
 
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wife
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wifeఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wife
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wifeTeacher
 
మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human life
మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human lifeమానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human life
మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human lifeTeacher
 
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు / Peculiarities of Prophet Mu...
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు  / Peculiarities of Prophet Mu...ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు  / Peculiarities of Prophet Mu...
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు / Peculiarities of Prophet Mu...Teacher
 
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadan
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadanరమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadan
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for RamadanTeacher
 
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Meraj
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Merajఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Meraj
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra MerajTeacher
 
parents with children - telugu .pdf
parents with children - telugu .pdfparents with children - telugu .pdf
parents with children - telugu .pdfTeacher
 
Ten things that could change your life - Arabic and telugu .pdf
Ten things that could change your life - Arabic and telugu .pdfTen things that could change your life - Arabic and telugu .pdf
Ten things that could change your life - Arabic and telugu .pdfTeacher
 
The value of experience - telugu అనుభవం విలువ.pdf
The value of experience - telugu అనుభవం విలువ.pdfThe value of experience - telugu అనుభవం విలువ.pdf
The value of experience - telugu అనుభవం విలువ.pdfTeacher
 
لا تحزن - Don't be sad - telugu and english.pdf
لا تحزن  - Don't  be sad - telugu and english.pdfلا تحزن  - Don't  be sad - telugu and english.pdf
لا تحزن - Don't be sad - telugu and english.pdfTeacher
 
leader and meneger telugu
leader and meneger  teluguleader and meneger  telugu
leader and meneger teluguTeacher
 
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం / Islam is a compassionate...
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం   / Islam is a compassionate...الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం   / Islam is a compassionate...
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం / Islam is a compassionate...Teacher
 
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం / Introducti...
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం  / Introducti...تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం  / Introducti...
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం / Introducti...Teacher
 
العواقب في طريق النجاح - تلغو / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...
العواقب في طريق النجاح - تلغو  / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...العواقب في طريق النجاح - تلغو  / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...
العواقب في طريق النجاح - تلغو / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...Teacher
 
దుఆల మణిహారం పిల్లల కోసం
దుఆల మణిహారం పిల్లల కోసం దుఆల మణిహారం పిల్లల కోసం
దుఆల మణిహారం పిల్లల కోసం Teacher
 
దుఆల మణిహారం పిల్లల కోసం / necklace of Duaa for children.pptx
దుఆల మణిహారం పిల్లల కోసం /  necklace of  Duaa  for children.pptxదుఆల మణిహారం పిల్లల కోసం /  necklace of  Duaa  for children.pptx
దుఆల మణిహారం పిల్లల కోసం / necklace of Duaa for children.pptxTeacher
 
india today .pptx
india today .pptxindia today .pptx
india today .pptxTeacher
 
water / దేవుడు ఇచ్చిన అద్భుత ఒనరు నీరు
water / దేవుడు  ఇచ్చిన       అద్భుత ఒనరు నీరు  water / దేవుడు  ఇచ్చిన       అద్భుత ఒనరు నీరు
water / దేవుడు ఇచ్చిన అద్భుత ఒనరు నీరు Teacher
 
వృద్ధో రక్షితే రక్షితః
వృద్ధో రక్షితే రక్షితః వృద్ధో రక్షితే రక్షితః
వృద్ధో రక్షితే రక్షితః Teacher
 
talli prema / తల్లి ప్రేమ
talli prema / తల్లి ప్రేమ talli prema / తల్లి ప్రేమ
talli prema / తల్లి ప్రేమ Teacher
 

Mehr von Teacher (20)

నెలవంక - Telugu Magazine Ramadan -nelavanka
నెలవంక -  Telugu Magazine Ramadan -nelavankaనెలవంక -  Telugu Magazine Ramadan -nelavanka
నెలవంక - Telugu Magazine Ramadan -nelavanka
 
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wife
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wifeఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wife
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wife
 
మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human life
మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human lifeమానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human life
మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human life
 
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు / Peculiarities of Prophet Mu...
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు  / Peculiarities of Prophet Mu...ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు  / Peculiarities of Prophet Mu...
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు / Peculiarities of Prophet Mu...
 
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadan
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadanరమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadan
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadan
 
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Meraj
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Merajఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Meraj
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Meraj
 
parents with children - telugu .pdf
parents with children - telugu .pdfparents with children - telugu .pdf
parents with children - telugu .pdf
 
Ten things that could change your life - Arabic and telugu .pdf
Ten things that could change your life - Arabic and telugu .pdfTen things that could change your life - Arabic and telugu .pdf
Ten things that could change your life - Arabic and telugu .pdf
 
The value of experience - telugu అనుభవం విలువ.pdf
The value of experience - telugu అనుభవం విలువ.pdfThe value of experience - telugu అనుభవం విలువ.pdf
The value of experience - telugu అనుభవం విలువ.pdf
 
لا تحزن - Don't be sad - telugu and english.pdf
لا تحزن  - Don't  be sad - telugu and english.pdfلا تحزن  - Don't  be sad - telugu and english.pdf
لا تحزن - Don't be sad - telugu and english.pdf
 
leader and meneger telugu
leader and meneger  teluguleader and meneger  telugu
leader and meneger telugu
 
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం / Islam is a compassionate...
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం   / Islam is a compassionate...الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం   / Islam is a compassionate...
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం / Islam is a compassionate...
 
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం / Introducti...
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం  / Introducti...تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం  / Introducti...
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం / Introducti...
 
العواقب في طريق النجاح - تلغو / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...
العواقب في طريق النجاح - تلغو  / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...العواقب في طريق النجاح - تلغو  / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...
العواقب في طريق النجاح - تلغو / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...
 
దుఆల మణిహారం పిల్లల కోసం
దుఆల మణిహారం పిల్లల కోసం దుఆల మణిహారం పిల్లల కోసం
దుఆల మణిహారం పిల్లల కోసం
 
దుఆల మణిహారం పిల్లల కోసం / necklace of Duaa for children.pptx
దుఆల మణిహారం పిల్లల కోసం /  necklace of  Duaa  for children.pptxదుఆల మణిహారం పిల్లల కోసం /  necklace of  Duaa  for children.pptx
దుఆల మణిహారం పిల్లల కోసం / necklace of Duaa for children.pptx
 
india today .pptx
india today .pptxindia today .pptx
india today .pptx
 
water / దేవుడు ఇచ్చిన అద్భుత ఒనరు నీరు
water / దేవుడు  ఇచ్చిన       అద్భుత ఒనరు నీరు  water / దేవుడు  ఇచ్చిన       అద్భుత ఒనరు నీరు
water / దేవుడు ఇచ్చిన అద్భుత ఒనరు నీరు
 
వృద్ధో రక్షితే రక్షితః
వృద్ధో రక్షితే రక్షితః వృద్ధో రక్షితే రక్షితః
వృద్ధో రక్షితే రక్షితః
 
talli prema / తల్లి ప్రేమ
talli prema / తల్లి ప్రేమ talli prema / తల్లి ప్రేమ
talli prema / తల్లి ప్రేమ
 

నెలవంక 2022 / Nelavanka

  • 1. www.nelavankaonline.com T e l u g u ‫البشرى‬ ‫مجلة‬ ‫ملحق‬ - )‫التلغوية‬ ‫(باللغة‬ ‫الهالل‬ ‫مجلة‬ 1443 Vol 16, Issue: 98 July - Sept. 2022 ‘ ‘జన భారత్‌ జన భారత్‌’ ’ ‘ ‘జయ జయ భారత్‌ భారత్‌’ ’ అవ్వాలంటే... అవ్వాలంటే... ‘జన భారత్‌’ ‘జయ భారత్‌’ అవ్వాలంటే...
  • 2. అల్లాహ్‌! ఆయన తప్ప మరొక నిజ ఆరాధ్య దేవుడు లేడు. ఆయన సజీవుడు, విశ్వ వ్యవస్థకు ఆధారభూతుడు ఆయనకు కునుకు రాదు మరియు నిదుర రాదు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తమూ ఆయనకు చెందినదే. ఆయన సమ్ముఖంలో ఆయన అనుజ్ఞ లేకుండా సిఫారసు చేయగల వాడెవడు? వారి ముందు ఉన్నదీ మరియు వారి వెనుక నున్నదీ అన్నీ ఆయనకు బాగా తెలుసు. మరియు ఆయన కోరితే తప్ప, ఆయన జ్ఞానవిశేషాలలో ఏ విషయమునూ వారు గ్రహించజాలరు. ఆయన కుర్సీ ఆకాశాలనూ మరియు భూమినీ పరివేష్టించి ఉన్నది. వాటి సంరక్షణ ఆయనకు ఏ మాత్రం అలసట కలిగించదు. మరియు ఆయన మహోన్నతుడు సర్వోత్తముడు. (దివ్య ఖురాన్ - 255 :2) మానవులందరి నిజ ఆరాధ్యుని పరిచయం
  • 3. July - Sept. 2022 14 6 18 Printing design: 995 700 34 HOTELINE ‫السعيدة‬ ‫للحياة‬ ‫المفيدة‬ ‫األسباب‬ * )‫الهند‬ ‫أحوال‬ ‫(عن‬ ‫العدد‬ ‫كلمة‬ * ‫املجلة‬ ‫فهرس‬ * ‫خاتم‬ ‫وسلم‬ ‫عليه‬ ‫الله‬ ‫صلى‬ ‫محمد‬ * ‫حياتك؟‬ ‫في‬ ‫تنجح‬ ‫كيف‬ * ‫النفس‬ ‫وعزة‬ ‫االحترام‬ * ‫السفلى‬ ‫اليد‬ ‫من‬ ‫خير‬ ‫العلياء‬ ‫اليد‬ * ‫الصالة‬ ‫المسلم‬ ‫عين‬ ‫قرة‬ * ‫والرسل‬ ‫األنبياء‬ ‫والمسكرات‬ ‫القمار‬ ‫عن‬ ‫تجنب‬ * Vol 16, Issue 98
  • 4. కోయిల తన భాష తాను మాట్లాడుతుంది. అందుకే స్వేచ్ఛగా విహరిస్తుంది. అదే చిలుక అయితే ఇతరుల పలుకుల్ని వల్లిస్తుంది. అందుకే అది స్వాతంత్య్రం కోల్పోయి పంజరంలో ఉండాల్సి వస్తుంది. బందీ అయిపోతుంది. ఎవరి భాషను వారు మాట్లాడుతూ ఎవరి ఆలోచనా విధానాన్ని వారు కాపాడుకుంటూ, ఎవరైతే ఆత్మవిశ్వాసంతో ఉంటారో వారే ముందుకు పోతారు. నిజం మాట్లాడేవారు కష్టాల పాలవుతారేమోగానీ, పరాజితులు కారు. బానిసలుగా మిగలరు. చెట్టపట్టాల్‌ పట్టుకుని దేశస్తులందరు నడువ వలెనోయ్ అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నియు మెలగవలెనోయ్ ! గురజాడ వారు రాసిన గీతంలోని ఈ చరణాలు నాటి భారతీయ సంస్కర్తలు, మేధావుల ఆకాంక్షనే గాక ఆలోచనా రీతిని తెలియజేస్తాయి. వందలాది మతాలు, జాతులు, భాషలు గల ఈ దేశం కలసి కట్టుగానే ముందుకు సాగాలని వారు స్పష్టంగా గుర్తించారు. సామాన్యుల నుంచి సామ్రాట్టుల వరకూ ప్రగాఢమైన మత విశ్వాసాలు ఎప్పుడూ వున్నాయి. వాటి ప్రభావమూ వుంది. అయినా ‘ఏ మతమైనా బోధించదుగా ద్వేషాన్ని రూపుదిద్దుదాం భిన్నత్వంలో ఏకత్వాన్ని’ అన్న అల్లామా ఇక్బాల్ వారి మాట స్ఫూర్తిగా ముందుకు సాగాలి. శాంతి, స్ధిరత్వానికి సంబంధించి, ఎన్ని ఒత్తిళ్ళు ఎదురైనా, 1947 నుండి భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా కొనసాగిందంటే లౌకికవాదం పట్ల మనకున్న నిబద్ధతే కారణమనేది వాస్తవం. బ్రిటిష్‌ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు కలిసి పోరాడారని మనం గుర్తుంచుకోవాలి. 1857లో భారతదేశ మొదటి స్వాతంత్య్ర సమరానికి నానా సాహిబ్‌, బహదూర్‌ షా జఫర్‌, మౌల్వీ అహ్మద్‌ షా, తాంతియా తోపే, ఖాన్‌ బహదూర్‌ ఖాన్‌, రాణి లక్ష్మీబాయి, హజ్రత్‌ మహల్‌, అజీముల్లా ఖాన్‌, ఫిరోజ్‌ షా వంటి నాయకులు సంయుక్తంగా నాయకత్వం వహించారు. హిందువులు, ముస్లిములు కలిసి అత్యున్నత త్యాగం చేసిన సందర్భాలతో మన చరిత్ర నిండి ఉంది. భారతదేశం నేడు అనేక సమస్యలను ‘జన భారత్‌’ ‘జన భారత్‌’ ‘జయ భారత్‌’ అవ్వాలంటే... ‘జయ భారత్‌’ అవ్వాలంటే... ‘జన భారత్‌’ ‘జన భారత్‌’ ‘జయ భారత్‌’ అవ్వాలంటే... ‘జయ భారత్‌’ అవ్వాలంటే... ‘జన భారత్‌’ ‘జయ భారత్‌’ అవ్వాలంటే... 4 2022 జూలై - సెప్టెంబర్
  • 5. ఎదుర్కొంటోంది. అదుపు లేని ధరలు, రెక్కలొచ్చిన ద్రవ్యోల్బణం, పాతాళానికి...డబ్బు విలువ, ఆరుగాలం శ్రమించి పంట బకాయిల కోసం చకోర పక్షుల్లా హాలికులు, నిరసన హక్కు తీవ్రవాద కార్యకలాపాల మధ్య రేఖ మసకబారి హక్కులకై పోరాడే శ్రామికులపై తప్పుడు కేసులు, కాలంచెల్లిన చట్టాలతో రాజద్రోహాలు చేతులకు సంకెళ్లు వేసి గొంతులను సమాధి చేసే రాజ్య క్రూరత్వానికి బలవుతున్న పోరాటయోధులు ఉద్యోగుల, కార్మికుల నిరసనలపై ఆర్డినెన్సులు సృజనాత్మకతపై దాడి అధ్యక్ష తరహా పాలన సాగించే అత్యున్నత కార్యాలయాలు గ్రామ పంచాయితీల హక్కులు కాలరాసే ప్రభుత్వాలు ఒక్కటేమిటి పాలన అస్తవ్యస్తం వ్యవస్థల తీరు చూసి నిస్సహాయ స్థితిలో ఓ తరం ఇదే...ఇదే నేటి భారతం. యువత శక్తిమంతమైనది. నవ సమాజ స్థాపన అయినా... జాతిహిత నిర్మాణమైనా యువశక్తితోనే సాధ్యం. దేశ సంపద, భవితకు పునాది... యువత. ఏ దేశ పురోగమనంలోనైనా యువతరానిదే కీలకపాత్ర. ‘ఇంక్విలాబ్‌ జిందాబాద్‌‘ అని దేశాన్ని కదిలించిన భగత్‌సింగ్‌ 23 ఏళ్ల వయస్సులో... జై హింద్..! అంటూ జన సామాన్యాన్ని సయితం చైతన్యబాటలో కదిలించిన యువకిశో రాలు ఎందరో 20 నుండి 30 సంవత్సరాల లోపే... స్ఫూర్తిదాయకమైన పాత్ర నిర్వహించారు. చెక్కుచెదరని ఆత్మ విశ్వాసానికి ప్రతీకగా యువత ఉన్నప్పుడే ఏ జాతి భవిష్యత్తయినా ఉజ్వలంగా వెలుగొందుతుంది. గుండెల నిండా చేవ, కరాల నిండా సత్తువ నిండియున్న యువత ఎక్కువగా వున్న దేశం మనది. ఉత్తేజంలోనూ, ఉత్పత్తిలోనూ, ముందుం డాల్సిన దేశం మనది. దేశంలో నేడు ఆ రకమైన ఉత్పత్తి జరగడం లేదు. యువతలో ఆ ఉత్తేజమూ లేదు. పాలకుల వైఫల్యాల కారణంగా యువతలో శక్తిసామర్థ్యాలు ఉడిగిపోతున్న పరిస్థితి. దీనికి తోడు... దేశంలో వ్యాపింపజేస్తున్న సాంస్కృతిక కాలుష్యం కూడా యువతను పెడితోవ పట్టిస్తోంది. భారతీయ సమాజం పురోగతి చెందాలంటే ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభం, తీవ్రమైన ఆర్థిక అసమానతలు, పేదరికం లాంటి సమస్యల పరిష్కారం కోసం తక్షణం శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. ఈ సమస్యల పరిష్కారానికి ప్రజల మధ్య సఖ్యత, ఐక్యత అవసరం. ఒక వైపు భారతీయుల మధ్య ఐక్యతకు భంగం కలిగిస్తూ, మరో వైపు భారత దేశ సమగ్రతను కాపాడాలని, భారత దేశాన్ని విశ్వ గురువుగా నిలబెట్టాలని ఏ దేశాభిమాని అయినా ఎలా ఆలోచించగలడు? ప్రపంచంలో ప్రథమ స్థానానికి పరుగులు తీస్తూ ‘జన భారత్‌’ అనిపించుకుంటున్న మనం అదే నోట ‘జయ భారత్‌’ అనిపించుకొనే రోజూ రావాలి! మన దేశానికి ఇప్పుడదే కావాలి!! 2022 జూలై - సెప్టెంబర్
  • 6. అనగనగా ఓ రాజుగారు ఉండేవారు. ఆయన అద్భుతమ ై న, అందమ ై న కోటలెన్నింటిలో నిర్మించాడు. కానీ ఎందుకనో ఆయనకు తనివి తీరలేదు. ప ్ర పంచంలో ఎక్కడా లేనటువంటి ఓ చిత ్ర మ ై న మహలుని నిర్మించాలనుకున్నాడు. శిల్పులందరూ వచ్చి తలా ఓ నమూనాను చూపించారు కానీ ఏవీ రాజుగారికి నచ్చలేదు. చివరికి ఓ శిల్పి చూపించిన అద్ దా లగది నమూనా ఆయనకు నచ్చింది. పని కానియ్యమన్నాడు. శిల్పి చూపించిన అద్ దా ల గది, అలాంటి ఇలాంటి గది కాదు. ఆ గదిలోకి ఎవరన్నా ప ్ర వేశిస్ తే వారిని ప ్ర తిబింబించేలా గదిలో అన్నివ ై పులా అద్ దా లే! గది ప ై కప్పు, కింద గచ్చు కూడా అద్ దా లతోనే తయారుచేశాడు. కంట్ లో నలుసు కూడా కని పించేంత స్పష ్ టంగా ఉన్నాయా అద్ దా లు. లోపలికి ప ్ర వేశించిన మనిషికి తాను ఎక్కడ నిల్చున్నాడో కూడా తెలియనంతగా నలుదిశలా కమ్ముకుని ఉన్నాయి ఆ అద్ దా లు. అంతేకాదు! ఆ అద్ దా ల గదిలోని శబ్ దా లు కూడా ఎంతో స్పష ్ టంగా ప ్ర తిధ్వనించేవి. రాజుగారు నిర్మించిన ఈ కొత ్త మహలు గురించి రాజ్యమంతా తెలిసిపోయింది. అందులోకి తొంగిచూసే అదృష ్ టం తమకి ఎప్పుడు వస్తుందా అని ప ్ర జలు తెగ ఎదురు చూడసాగారు. ఓ రాత్రి అనుకోకుండా రాజుగారి కుక్క అందులోకి ప ్ర వేశించింది. లోపలికి అడుగుపెట ్ట గానే దానికి మతి పోయింది. తనలాంటి వందలాది కుక్కలు తనని చుట్టుముట్టి ఉన్నాయి. ఈ మహలులో రాజుగారి చెంతన ఉండే అర ్హ త తన ఒక్కదానికే ఉందనుకుందది. ఆ కుక్కలను భయపెట ్ట డానికి ఒక్కసారిగా తన వాడి పళ ్ల ను చూపించింది. చిత ్రం! అవి కూడా అలాగే తనని భయపెట ్టేందుకు కోరలు చూపించాయి. యుద్ ధా నికి సిద ్ధం అన్నట్లు గా ఒక్కసారి గట్టి గా మొరిగింది కుక్క! దానికి నాలుగువ ై పుల నుంచీ భీకరంగా శబ్ దా లు ప ్ర తిధ్వనించాయి. ఇక తన చుట్ టూ ఉన్న కుక్కలతో పోరాటం చేయక తప్పలేదు. గాల్ లో కి ఎగిరెగిరి పడుతూ, లేని శత్ రు వులను ఉన్నారనుకుని అద్ దా ల మీద పడుతూ నానా భీభత్సం సృష్టించింది. ఉదయాన్నే అద్ దా ల గదిలోకి వచ్చిన భటులకి ఆ కుక్క నిర్ జీ వంగా కనిపించింది. రాత ్రంతాతన ప ్ర తిబింబాలతో పోరాటం చేసిన ఆ కుక్క ఓడి పోయింది. మన మనసు కూడా అద్ దా ల గదిలాంటిదే! భయాలు నిజమవకుండానే వాటితో తలపడుతూ ఉంటాము. లేనిపోని అనుమానాలతో మనమీద మనమే పోరాటం చేస్ తూ ఉంటాము! కానీ అందులో గెలుపుకి అవకాశం లేదు. ఉండేదల్లా ఓటమే! అనురాగ గోపురాన్ని కాపాడే కొన్ని సూత్ రా లు వివాహ బంధం బలంగా ఉండాలంటే అనురాగం చూపించుకోవడం తప్పనిసరి. మనం బలంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం, నీళ్ లు క ్ర మంగా అనురాగాన్ని పెంచుదాం! అనుమానాన్ని త ్ర ుంచుదాం!! కనువిప్పు కలిగించే ఓ పిట ్ట కథ హయా తరన్నుమ్ 2022 జూలై - సెప్టెంబర్ 6 2022
  • 7. తీసుకోవడం ఎంత ప్ రాముఖ్యమో, వివాహ బంధాన్ని పోషించి బలపర్చుకోవడానికి క ్ర మంగా అనురాగం చూపించుకోవడం కూడా అంతే ప్ రాముఖ్యం. పెళ ్ల యి దశాబ్ దా లు గడిచినా, వివాహ భాగస్వామికి తన మీద ఎంతో ప్ రే మ, శ ్ర ద ్ధ ఉన్నాయనే భరోసా భార్యకు/భర ్త కు అవసరం. నిజమ ై న ప్ రే మలో స్వార ్ థం ఉండదు. నిజమ ై న ప్ రే మ ఎదుటివ్య క్తి సంతోషాన్ని కోరుకుంటుంది. సాధారణంగా, భర ్త ల కన్నా భార్యలు ఎక్కువగా అనురాగాన్ని కోరుకుంటారు. భర ్త కు భార్య మీద చాలా ప్ రే మ ఉండవచ్చు. కానీ ఆ ప్ రే మను కేవలం ఉదయం ఒకసారి, సాయంత ్రం ఒకసారి, లేదా ల ై ంగిక సంబంధానికి ముందు మాత ్ర మే చూపిస్ తే , అసలు తన భర ్త కు నిజంగా తనమీద శ ్ర ద ్ధ ఉందా అనే అనుమానం భార్యకు రావచ్చు. కాబట్టి ప ్ర తీరోజు వీల ై నప్పుడల్లా అనురాగం చూపిస్ తూ ఉండడం మంచిది. మాటల్ లో అనురాగం చూపించండి. “ఐ లవ్‌ యు,” “నువ్వు నాకు దొరికిన వరం” లాంటి చిన్నచిన్న మాటలు కూడా మీకు తనంటే ఎంత ఇష ్ట మో మీ భార్యకు చూపిస్తా యి. “హృదయం నిండా ఏముంటే నోరు అదే మాట్లా డుతుంది.”​ఓ ప్ రా చీన నానుడి.మీఅనురాగాన్నిమాటలకేపరిమితంచేయాల్సిన అవసరం లేదు. మీరు తనను ఎంతగా ప్ రే మిస్తు న్నారో రాసి చెప్పండి, లేదా వాట్సాప్, టెలిగ్రా మ్, ఈ మెయిల్ మెసేజ్‌ పంపండి. చేతల్ లో అనురాగం కౌగిలించుకోవడం, గిల్ లి కజ్ జా లాడటం , లేదా ఊరికే చేతులు పట్టు కోవడం లాంటివి మీరు నిజంగా తనను ప్ రే మిస్తు న్నారు కాబట్టే “ఐ లవ్‌ యు” చెప్పారని మీ భార్యకు తెలియజేస్తా యి. మృదువుగా తాకడం, ప్ రే మతో చూడడం, అప్పుడప్పుడు బహుమతులు ఇవ్వడం ఇవన్నీ నిజమ ై న శ ్ర ద ్ధ ఉందని చూపిస్తా యి. అంతేకాదు, తనకు సహాయం చేయడానికి మీరు బ్యాగులు మోయడం, తలుపు తీసి ఉంచడం, గిన్నెలు కడగడం, బట ్ట లు ఉతకడం, లేదా వంట చేయడం లాంటివి కూడా చేయవచ్చు. చాలా సందర్భాల్ లో , ఈ పనులు చేయడం ద్వారా మీరు తనకు సహాయం చేయడమే కాదు, మీ అనురాగాన్ని చేతల్ లో చూపిస్తా రు! అంటే మనం మన ప్ రే మను మాటల్ లో మాత ్ర మే కాదు చేతల్ లో చూపించాలి. పెళ్ లి కాక ముందు పరిచయమ ై న కొత ్త లో తనమీద ఎంత శ ్ర ద ్ధ చూపించేవాళ్ లో ఇప్పుడూ అంతే శ ్ర ద ్ధ చూపించడానికి ప ్ర యత్నించండి. సమయంలో అనురాగం మీ భర ్త /భార్య కోసం సమయం కేటాయించండి. మీరిద ్ద రు కలిసి సమయం గడపడం వల ్ల మీ వివాహ బంధం బలపడుతుంది, అంతేకాదు తనతో సమయం గడపడం మీకు ఇష ్ట మని మీ భర ్త కు/ భార్యకు తెలుస్తుంది. నిజమే, మీకు పిల ్లలుంటే లేదా ప ్ర తీరోజు చాలా విషయాల గురించి మాట్లా డుకోవాల్సిన అవసరం ఉంటే, మీరిద ్ద రు కలిసి ఎక్కువ సమయం గడపలేకపోవచ్చు. అలాంటప్పుడు కేవలం మీరిద ్ద రు కలిసి కాసేపు వాకింగ్‌ చేసేలా ఏర్పాటు చేసుకున్నా మంచిదే. అభిరుచుల్ లో అనురాగం మీ భర ్త /భార్య అభిరుచులు, కోరికలు, అవసరాలు తెలుసుకోండి. అనురాగం కోరుకునే విషయంలో ఒక్కో వ్య క్తి అభిరుచులు ఒక్కోలా ఉంటాయి. మీరు తనమీద ఎలా అనురాగం చూపించాలని మీ వివాహ జత కోరుకుంటున్నారో, మీరు ఇంకా ఎక్కువ అనురాగం చూపించాల్సిన అవసరం ఉందేమో ఒకరితో ఒకరు మాట్లా డి తెలుసుకోండి. తర్వాత, తను కోరినట్టు చేయడానికి కృషి చేయండి. వివాహ బంధం బలంగా ఉండాలంటే అనురాగం చూపించడం తప్పనిసరి అని గుర్తుంచుకోండి. మీ వివాహ జతను మీ మీద అనురాగం చూపించమని (మిగతాది 9 వ పేజీలో) 7 2022 జూలై - సెప్టెంబర్
  • 8. ప్రతి మనిషీ గౌరవం కోరుకుంటాడు. మర్యాద మన్ననలు పొందాలనుకుంటాడు. గుర్తింపు లభించగానే ఉత్సాహం రెట్టింపు అవుతుంది. మెప్పులు, అభినందనలు అందగానే మనసు సంతోషంతో నిండిపోతుంది. అందరూ మెచ్చే ఘనకార్యాలు చేసేందుకు మనసు పురి విప్పుతుంది. రావాల్సిన సమయంలో గుర్తింపు రాకపోతే జీవనో త్సాహంపై నైరాశ్యపు నీడలు కమ్ముకుంటాయి. అడుగులు ముందుకు వెయ్యడం ఆగిపోతుంది. ఇది మనసు నైజం. అందుచేత దాన్ని ఓ కంట కనిపెడుతూ ఉండాలి. కోరిక నెరవేరలేదని వ్యక్తి మీద లేదా వ్యవస్థ పైనా మనసు అలకబూనుతుంది. అలా చేయడమూ ప్రతీకారం తీర్చుకోవడమే అవుతుంది. అది ప్రాకృతిక ప్రామాణిక సూత్రాలతో కూడిన ధార్మిక (సాధికారిక) జీవన విధానానికి విరుద్ధం. చప్పట్లు, బహుమానాలు, పథకాలు, పురస్కారాలు ఎదుగుదలను కాంక్షించే ఉత్ప్రేరకాలు. అవి కృషిని కీర్తిస్తాయి, ప్రోత్సహిస్తాయి. మరొకరికి స్ఫూర్తినిస్తాయి. అవి రానంత మాత్రాన కుంగిపోకూడదు. - ఒక చిరునవ్వు, చిన్న పలకరింపు- గౌరవించడం కిందకే వస్తాయి. అవి మనుషుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందిస్తాయి. మహానుభావులు ఎందరో ఉన్న వేదిక మీద నుంచి ఓ గొప్ప వ్యక్తి మనల్ని పేరు పెట్టి పిలవడం మన చెవులకు ఎంత ఇంపుగా ఉంటుంది. ఆ క్షణాల్లో మనం ఎంత ఆత్మానందాన్ని లోనవుతాం! రక్త సంబంధీకులు, బంధువులు, ఆత్మీయులు శుభకార్యాల పేరిట మీ ఇంటికి వస్తే, ఇంటిల్లిపాది ఎదురెళ్ళి ఘన స్వాగతం పలుకుతారు. అది సామూహిక మర్యాద. కొందరు చెమ్మగిల్లిన కళ్లతో హృదయాల్ని తాకుతారు. అది ఆత్మలు పెనవేసుకున్న ఆలింగనం. నేలపై కూర్చున్నవాళ్లు సైతం లేచి నిలబడినప్పుడే వచ్చిన అతిథికి గౌరవం ఇచ్చినట్లు భావిస్తారు. ఆత్మగౌరవం మనిషికి నిజమైన ఆభరణంలా భాసిస్తుంది. ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని సొంతం చేసుకుని, నమ్మిన సిద్ధాంతం కోసం, విలువలకోసం రాజీ పడకుండా ముందుకు సాగే లక్షణానికి మనం చెప్పుకునే అందమైన పదభూషణం ‘ఆత్మ గౌరవం’. సమపాళ్ళలో కలిగి ఉండే ఈ లక్షణం సమాజంలో అగణ్యత, అగ్రగణ్యత సంపాదిస్తుందో లేదో తెలియదు కానీ, జీవన గమనానికి ఖచ్చితంగా నిజమైన నాణ్యతను సంతరిస్తుంది. ‘‘ఆయనకు ఆత్మగౌరవం చాలా ఎక్కువండీ.. ఎక్కడా రాజీ పడకుండా జీవిస్తాడు’’ అనే మాటను మనం కొంతమంది వ్యక్తులను ఉద్దేశించి, మిగిలినవాళ్ళు మాట్లాడుకోవడం వింటూ ఉంటాం. అహంకారం ఉన్నవారు తమ కోసం కాక, ఎదుటివాళ్ల దృష్టిలో తాము గొప్పగా వున్నట్లుగా భావన చేసుకుని జీవికను సాగిస్తారు. ఎవరైనా తన గురించి తక్కువ, ఎక్కువల తేడా చూపిస్తే చాలు, అవమానంతో రగిలిపోతారు. ప్రతీకార భావంతో ఊగిపోతారు. మాటల తూటాలతో పెట్రేగిపోతారు. అహంకారంతో ఉండేవాళ్ళు, విలువల కోసం ప్రయత్నించక, పక్కవారి ముందు ఉన్నతులుగా గుర్తింపబడాలని కోరుకుంటారు. వీరిలో చెలరేగే అహంకారం వారిలో ఉన్న మంచిని కూడా ఎదుటివారిని చూడనీయకుండా చేస్తుంది. అహంకారంతో వర్తించడం ఎంత నేరమో, ఆత్మగౌరవాన్ని చంపుకోవడం అంతకుమించిన గౌరవం – ఆత్మ గౌరవం గౌరవం – ఆత్మ గౌరవం నదా ఫాతిమా 8 2022 జూలై - సెప్టెంబర్
  • 9. దోషం.. నేరం!! సమాజం తీరును మనం నిశితంగా పరికిస్తే, అత్యాశలకు లోనైనప్పుడే, మనిషి జీవనశైలిలో ఉన్న సమతౌల్యం దెబ్బ తింటుంది. అనవసరమైన కోరికలనే గుర్రాలవెంట పరుగెడుతూ, వాటిని ఏ విధంగానైనా తీర్చుకోవాలనే తపన ప్రబలినప్పుడే, మనిషి తాను పాటించే విలువల విషయంలో, ఆత్మను వంచన చేసుకునేలా రాజీపడి, ఎదుటివాడి ముందు తలను వంచుతాడు. ఒకరకంగా దీన్నే నైతిక పతనానికి నాంది అని చెప్పవచ్చు. ఎందుకు ఈ అనవసరపు వెంపర్లాట..!! మనం నమ్ముకున్న సూత్రాల విషయంలో అవలంబించే రాజీ ధోరణి తాత్కాలికంగా సుఖమయమనిపించినా, దీర్ఘకాలంలో తప్పనిసరిగా మనకు మానసిక క్లేశాన్ని కలిగిస్తుందని ఎన్నో ఉదాహరణలు తెలియజేస్తాయి. ఎవరికీ తలవంచకుండా, అధికమైన ఆశలతో ఎవరెవరినో ఆశించకుండా, దృఢమైన చిత్తంతో సాగుతూ, నిండుగా నిలుపుకునే ఆత్మగౌరవమే గుండెకు ఆనందరవం..!! జీవన వనాన విరిసే ఆమనిలో అదే మధురంగా కిలకిలమనే కోకిలారావం..!! సంస్కారాలు, విలువలు, నియమాలతో కూడిన జీవన ఆచరణ కలిగినవారు ఒకరి ముందు తలవంచరు. దీనికి ధనంతో ఏమాత్రం పనిలేదు. సంస్కారాలకు ఉన్న మహత్తరమైన విలువ అలాంటిది. వీరు ఆదర్శ జీవనాన్ని జీవిస్తూ, ఉన్నంత లో ఎదుటివాళ్లచేత గుర్తింపును, గౌరవాన్ని పొందేవారుగా తమను తాము మలుచు కంటారు. అలాంటి వారు తమకు తాము కొన్ని హద్దులు పెట్టుకొని వాటిని దాటకుండా ఒక్కరిపైన ఆధారపడకుండా ఆత్మగౌరవంతో నిరంతరం జీవిస్తారు. తెలుగోడి ఆత్మ గౌరవం.. అన్న ఎన్టీఆర్‌ మాట ఎన్ని అద్భుతాలు చేసిందో ఉభయ రాష్ట్రాల ప్రజలకు తెలియనిది కాదు. ఒకరి నీడనిచూసి ఉలిక్కిపడుతున్న వారు కొందరు. ఒకరి రాకను చూసి ముక్కు మూసుకుంటున్న వారు కొందరు. ఒకరి రూపం చూస్తేనే దూరంగా తొలగిపోతున్న వారు కొందరు. ఇలాంటి ఎన్నో అవమానాలు, అస్పృశ్యతా ఆచారాలు, దౌర్జన్యాలు, అత్యాచారాలు భరిస్తూనే తరాలు గడిచిపోయాయి. గౌరవం, ఆత్మగౌరవంతో తల పైకెత్తనివ్వడం లేదు. సమాజం ఆధునికంగా అభివృద్ధి అయ్యిందేమో కాని అసమానతలు, కక్షలు, వివక్షలు నాటి నుండి నేటి వరకు అలానే ఉన్నాయి. అంటరానితనపు విషపుమొక్కని ఈ జీవ ధాత్రిలో ఎవరు మొలకెత్తించారు? ఆస్పృశ్యతా కళంకంతో దేశ చరిత్ర అంతా కాలుష్యభరితం ఎవరు చేశారు? కులం కంపుతో, మతం చిచ్చుతో ఛీత్కారాలకులోనై ఎందరో దురాచారాలకు, దురాగతాలను, దుర్మార్గాలకు, దమననీతులకు, దహనకాండలకు బలైపోయారు. ఊరులో ఉంటూనే ఊరికి దూరమయ్యారు. తర తరాలుగా యుగాలుగా అంటరాని పెనుమంటకి గురై మాడి మసి బారిన బతుకులుగా మిగిలిపోయారు. ఈ పాపం ఎవరిది? మనిషిది కాదా? ఇటువంటి దురాచారాలను దూరం చెయ్యాల్సిన బాధ్యత మన మీద లేదా? ఏ సమాజంలోనైనా ఏ భాషలోనైనా ఆనాటి సమాజ వ్యవస్థను బట్టి సాహిత్య వికాసం జరుగుతుంది. వికాసమన్నది సమాజాన్ని వేలు పట్టుకుని పురోగమ నం వైపు తీసుకెళుతుంది. వ్యవస్థలో అనేక సమస్యలు పద్యమై, గద్యమై, వచనమై, ప్రవచనమై, వ్యాసమై, కవితయి ప్రశ్నించాయి, ప్రశ్నిస్తూనే ఉన్నాయి. లింగ వివక్ష, కులవివక్ష, అసమానతలు, నిమ్నవర్గాలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు నేటికీ మనముందు సవాళ్ళుగా మిగిలిపోయాయి. వారూ మనుషులే, వారికీ మంసుంటుందని, వారికి మెదడుంటుందనీ, వారి మనో భావాలు కూడా దెబ్బ తింటాయని గ్రహించ గలిగిన నాడే, వారి ఆత్మ గౌరవాన్ని గుర్తిస్తూనే, వారిని సాటి మనిషిగా గౌరవించిన నాడే సమాజానికి, సంఘానికి, దేశానికి నిజమైన గౌరవం. 9 2022 జూలై - సెప్టెంబర్
  • 10. వినండి! ఇహలోక జీవితం ఒక ఆట, తమాషా, బాహ్య పటాటోపం, పరస్పరం బడాయి చెప్పుకొని గర్వించడం, సంతానం, సిరిసంపదలలో ఒకర్నొకరు మించిపోవడా నికి ప్రయత్నించడం తప్ప మరేమీ కాదు. ఐహికజీవితాన్ని ఇలా పోల్చవచ్చు: వర్షంతో ఎదిగిన మొలకల్ని చూసి రైతులు సంబర పడిపోతారు. తర్వాత ఆ పొలం పంటకు వచ్చి ఎర్రబారడం కన్పిస్తుంది. ఆ తర్వాత తుప్పగా (గడ్డిపరకలుగా) మారిపోతుంది. (దివ్య ఖురాన్: అల్ హదీద్ -20) ఆటలో అన్ని అడ్డంకులను అధిగమించి చివరకు విజయ లక్ష్యం సాధిస్తే విజేత అవుతారు. అదేవిధంగా జీవితం ఒక ఆట, సుదీర్ఘ జీవితకాలం ఒక మైదానంలో క్రీడా స్పూర్తితో ఆడాలి... పోరాడి గెలవాలి. అయితే ఒక్క విజయం సిద్ధిస్తే ఆట ఆగిపోదు. చివరి వరకు ఆడి విజయ పతాకాన్ని ఎగురవేయాలి. జీవితంలో అనేక జయాలు, మరెన్నో పరాజయాలు తటస్థించి ఆశ నిరాశలకు గురి చేస్తాయి. ఇక నేను సాధించలేను ఓడిపోయాను అనిపిస్తుంది. అప్పుడే ధైర్యం, ఆత్మ విశ్వాసం, ఆశాభావం అవసరం. పసి వయసులో ఎదుగుదల కఠోర పరిశ్రమ. పొట్టను నేలకు ఆనించి ముందుకు పాకడం, మోకాళ్లమీద చేతుల సహాయంతో సాగడం, కూర్చోవడం, నిలబడటం, తడబాటు అడుగుల నడక, క్రమంగా పరుగు... ఇవన్నీ మన -కాళ్ల మీద మనం నిలవాలనే లక్ష్యంగా సాగే సాధనా ప్రక్రియలు. జీవితంలో ప్రతి సన్నివేశం మనల్ని భయ పెడుతుంది. పరీక్షిస్తుంది. నిలిచి గెలవగలమా అనే సందేహం కలుగుతుంది. ధైర్యాన్ని నింపుకొని సముచిత దయం తీసుకుని అడుగు ముందుకు వేస్తే విజయం తథ్యం. ఆరంభింపరు నీచ మానవులు, ఆరంభించినా మధ్యలో వదిలేవారు బలహీన మానవులు వారే పరాజితులని భర్తృహరి పేర్కొన్నాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా లక్ష్యంతో సాగితే... విజయమాల వరిస్తుంది. వారే ధీరులు, ఉత్తములని కీర్తించాడు. పోటీతోనే ఆట సాగాలి. గెలవాలన్న పట్టుదల, తెగింపు ఉండాలి. ఆట మైదానమైనా, జీవన విధానమైనా... విజయ పతాకాన్ని ఎగురవేయాలి. బాల్యంలో చదువుల్లో పోటీ; విషయాలు అర్థం చేసుకుని పరీక్షలో అత్యున్నత స్థాయికి చేరి ఉద్యోగంలో స్థిరపడేందుకు యువత ఆరాటం, ఆశయం; ఎంచుకున్న వృత్తిలో అంచెలంచెలుగా ఎదగాలనే వృత్తిధర్మం... ఇవన్నీ పోటీలే. వివాహం, కుటుంబం... అన్నీ జీవిత రణరంగ విన్యాసాలు. మనసును బలహీనపరచే పిరికితనం చంచలత్వం వైపు మరల్చితే దిగజారడం తప్పదు. ధైర్యం, పట్టుదల, నిరంతర కృషి వైపు మనసును మళ్ళిస్తే విజయం తథ్యం. శ్రద్ధ ఓర్పు సహనం ప్రేమ- ఇవే విజయ తీరాలకు చేర్చే దిక్సూచులు. క్షమించడం పరాజయం పతనం కాదు... అది విజయానికి పునాది హమద్ ఖాలిద్ 10 2022 జూలై - సెప్టెంబర్
  • 11. వల్ల గతం మారకపోవచ్చుగానీ భవిష్యత్తు మాత్రం మనకు అనుకూలంగా మారుతుంది. పూల పరిమళం గాలి వాటుకే వెళుతుంది. మనిషి మంచితనం మాత్రం ప్రతి దిక్కుకు ప్రసరిస్తుంది. ప్రపంచంలో మనకు వేరే శత్రువులు కానీ.. మిత్రులు కానీ ఉండరు. మన నడవడికే మిత్రులను, శత్రువులను సంపాదించి పెడుతుంది. పరాజయాలు జీవితంలో సహజం అనే సమస్థితి సాధించాలి. రోదనలతో వేదన చల్లారుతుంది కానీ విజయం లభించదు. పడిన చోటు నుంచే పైకి లేవాలి. ఓడిన చోట గెలుపు సాధించాలి. శిఖరాన్ని ఎక్కేప్పుడు ప్రతి అడుగూ జాగ్రత్తగానే వేయాలి, ఎందుకంటే ఒక తప్పటడుగు మనల్ని పాతాళానికి పడేయవచ్చు. ఓటమి అంచున నిలబడిన వారూ గెలుపు తీరాలకు చేరారు. పరాజయం పతనం కాదు... అది విజయానికి పునాది, సూర్యోదయాన్ని తెచ్చే ఉదయ సంధ్య, ఉన్నత స్థాయికి చేర్చే తొలి మెట్టు. ఓర్పు ఎప్పటికీ బలమే. బలహీనత ఎంత మాత్రం కాదు. మన ప్రయత్నాలన్నీ విఫలమైనప్పుడు, మరింత ఓర్పు తో ప్రయత్నిస్తే అనితర సాధ్యమైన విజయాలు సాధించవచ్చు, ‘ఓరిచితే తనపంతం ఊరకేవచ్చు; అంటారు. ఓర్పు వహిస్తే మన పట్టుదలలన్నీ తప్పక నెరవేరతాయని భావం. మన ప్రతిభ, సామర్ధ్యం పట్ల ఆత్మ విశ్వాసం కాకుండా, అతి విశ్వాసం ఉంటే, తక్షణం వాటిని మొహమాటం లేకుండా, ఆత్మ విమర్శతో విశ్లేషణ చేసుకోవాలి. మన ఆలోచనలకంటే విభిన్నంగా మన లక్ష్యాలు ఎందుకున్నాయో అవగాహన చేసుకుని, సాధించగలిగిన లక్ష్యాలను ఏర్పరచుకోవాలి. జయాపజయాలు పగలు, రాత్రి లాంటివి. ఒక దానినొకటి వెంబడిస్తాయి. ఒక అంశంలో మనకు అపజయం ఎదురైతే, మరో లక్ష్యంతో విజయం సాధించవచ్చు. అడిగే బదులు, ‘నా భర ్త /భార్య నా మీద ఇంకా ఎక్కువ అనురాగం చూపించాలంటే నేనేం చేయాలి?’ అని ఆలోచించండి. సాధారణంగా ఒక వ్య క్తి ఎన్ని పెద ్ద పెద ్ద పదవుల్ లో రాణించినా ఇంటిలో తన బలహీనతలు బయట పడుతుంటాయి. అవి తన యింటి వారికి ఇంటిలో పనివారికి తెలుస్తుంటాయి. అలాగే ఆ వ్య క్తి యొక్క వ్య క్తి త్వం, అతనిలోని మానవత్వం, సేవాగుణం కూడ బయటవారి కన్నా ఇంటి వారే ఎక్కువ గుర ్తించగలుగుతారు. ఎందుకంటే తాను ఓ ఇంటి యజమాని గా ఇంటివారందరిప ై న ఆధిపత్యం చెలాయించే హక్కు కలిగిఉంటాడు. ఆధిపత్యం, అధికారం ఉన్నప్పుడే బలాలు, బలహీనతలన్నీ బయట పడతాయి అన్నది ఓ ప్ రా చీన నానుడి. కనుకనే ‘‘ఒక వ్య క్తి నిజ స్వరూపం తెలుసుకోవాలంటే అధికారమిచ్చి చూడు’’ అన్నారు వెనుకటికి పెద ్ద లు. అయిషా (రజి.అ) వారిని కొందరు ముహమ్మద్ (స) వారు ఇంటిలో ఎలా ఉండేవారు అని ప ్ర శ్నించారు. అప్పుడు వారు ఇలా సమాధానం ఇచ్చారు: ఆయన ఓ సాధారణ వ్య క్తి లానే ఇంట్ లో మసలేవారు. తన బట ్ట లు తానే సర్దు కునేవారు. మేకల నుండి పాలు పితికేవారు. మా.పనులలో సహకరించేవారు అని అన్నారు. (తిర్మిజి) ముహమ్మద్ (స) వారి కోసం అన్నీ వదులుకునివచ్చిన ఎందరో సహబీలు ఆయన ఏది కోరితే అది తెచ్చిపెట్టే సహచరులు ఉన్నప్పటికి ఆయన ఓ సాధారణ జీవితాన్నే గడిపేవారు. ఎన్నో రాత్ రు లు అర్ ధా కలితో పడుకునేవారు. ఏనాడూ ఆర్భాటాలకు, అహంకారాలకు గొప్పలకు పోలేదు. (అనురాగాన్ని పెంచుదాం ... 5 వ పేజీ మిగతా భాగం) అనురాగాన్ని పెంచుదాం! అనుమానాన్ని త్రుంచుదాం!! 2022 జూలై - సెప్టెంబర్
  • 12. 12 2022 జూలై - సెప్టెంబర్ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)ను అంతిమ దైవప్రవక్తగా విశ్వసించడం ఈమాన్ మూల విశ్వాసాలలో ఒకటి. దీనిపైనే ఒక విశ్వాసి విశ్వాసం ఆధారపడి ఉంటుంది. ఏ వ్యక్తయితే దైవ ప్రవక్త (స)ను విశ్వసించడో అతను విశ్వాస పరిధుల నుండి దూరమై అవిశ్వాసుల్లో చేరుతాడు. అలాగే దైవ ప్రవక్త కాని వ్యక్తిని దైవ ప్రవక్తగా భావించి విశ్వసిస్తే అలాంటి వ్యక్తి కూడా అవిశ్వాసి అవుతాడు. ఇస్లాం ధర్మంలోని కీలకమైన, సూక్ష్మమైన సిద్ధాం తాలను పవిత్ర ఖుర్ఆన్ లో అల్లాహ్ క్లుప్తంగా తెలియజేశాడు. వాటిని మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) హదీసులో విశదీ కరించారు. ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తర్వాత మరో ప్రవక్త వచ్చే ప్రసక్తే లేదు ‘దైవ ప్రవక్తల పరంపర’పై విశ్వాసమనేది ఎంతో కీలకమైన విషయం. దీనిపై పూర్తి ముస్లిం సమాజం (ఉమ్మత్) మధ్య ఏకాభిప్రాయం ఉంది. అందుకే ఏ వ్యక్తయినా సరే ప్రవక్త ముహమ్మద్ (స)ను, చిట్టచివరి ప్రవక్త అని విశ్వసించిన తరువాతే అతని విశ్వాసం పరిపూర్ణ మవుతుంది. ఒక వేళ ఎవరైనా ప్రవక్త (స) ను చిట్టచివరి సందేశహరునిగా అంగీకరించకపోతే ఆ వ్యక్తి ఇస్లాం ధర్మం నుండి బహిష్కరించ బడతాడు. ఎందుకంటే అల్లాహ్ పవిత్ర ఖుర్ఆన్లో ఇలా స్పష్ట పర్చాడు: “ప్రజలారా! ముహమ్మద్ (స) మీ పురుషు ల్లో ఎవరికీ తండ్రి కాడు. అయితే ఆయన అల్లాహ్ సందేశహరుడు, ప్రవక్తల పరంపరను పరిసమాప్తం చేసే (చివరి) వాడు”. (అల్ అహ్ జాబ్-40) పై ఆయత్ లో ముహమ్మద్ (స) ను ప్రవక్తల పరంపరను సమాప్తం చేసేవారిగా చెప్పటం జరిగింది. దాని కొరకు ప్రత్యేకంగా “ఖాతమున్” అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. “ఖాతమ్” అంటే “సీలు’ అని అర్ధం. ఒక పనిని పూర్తి చేసిన అంతిమ దైవ దౌత్యాన్ని విశ్వసించటం ద ై వదౌత్య పరిసమాప్ తి ద ై వదౌత్య పరిసమాప్ తి ద ై వదౌత్య పరిసమాప్ తి డా. సయీద్అ హ్మద్ మదనీ
  • 13. 13 2022 జూలై - సెప్టెంబర్ తరువాత చివరగా ‘సీలు’ (ముద్ర) వేయడం జరుగుతుంది. అంటే ఆ పని చివరి వరకూ పూర్తయినట్లే. ఉదాహరణకు పవిత్ర ఖుర్ఆన్ ను ప్రారంభం నుండి చివరి వరకు చదవడాన్ని "ఖత్ ముల్-ఖుర్ఆన్” (ఖుర్ఆన్ పూర్తి చేయటం) అంటారు. (లిసానుల్ అరబ్, నిఘంటువు) పై వాక్యాల ద్వారా ప్రవక్తల పరంపర సమాప్తమైందని తెలుస్తుంది. అంతేకాకుండా దీనిపై వాదోపవాదాలు, ఘర్షణలు కూడా అనర్ధమని తెలుస్తోంది. ఎందుకంటే పవిత్ర ఖుర్ఆన్, హదీసుల్లో ప్రస్తావన వచ్చిన తరువాత వాటిని విస్మరించి మరో మార్గాన్ని అనుసరించడం అజ్ఞానం, మార్గ భ్రష్టత్వం అవుతుంది. ప్రవక్తల పరంపర పరిసమాప్తికి సంబంధించిన కొన్ని హదీసులను పరిశీలిద్దాం : 1. అల్లాహ్ అంతిమ ప్రవక్త (స) ఈ విధంగా తెలిపారు: “బనీ ఇస్రాయీల్ కు ప్రవక్తలు నాయకత్వం వహించారు. ఒక ప్రవక్త మరణిస్తే ఆ తర్వాత మరో ప్రవక్త ప్రాతినిధ్యం వహించేవారు. అయితే నా తరువాత ప్రవక్తలుండరు, ఖలీఫాలు మాత్రమే ఉంటారు.” (బుఖారి: కితాబుల్ మనాఖిబ్) 2. దేవుని అంతిమ ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు : “నాకు ఆరు విషయాలలో మునుపటి ప్రవక్తలపై ఆధిక్యత ఇవ్వబడింది. 1) నాకు సమగ్రమైన విషయాన్ని సంక్షిప్తంగా చెప్పే నేర్పు వొసగబడింది. 2) గాంభీర్యం ద్వారా నాకు సహాయం అందజేయబడింది. 3) యుద్ధ ప్రాప్తి నా కొరకు ధర్మసమ్మతం చేయబడింది. 4) నా కొరకు సమస్త భూమి సజ్జా చేసే స్థలంగా మరియు పవిత్రంగా చేయబడింది. 5) నన్ను సమస్త జాతుల వైపునకు ప్రవక్తగా చేసి పంపటం జరిగింది. 6) నాతో దైవ దౌత్యం పరిసమాప్తం చేయబడింది. (సహీహ్ ముస్లిం, తిర్మిజి, ఇబ్ను మాజా) 3. అల్లాహ్ అంతిమ ప్రవక్త (స) ఇంకా ఇలా సెలవిచ్చారు: “నేను ముహమ్మద్ ని, అహ్మద్, మాహీని, నా ద్వారా (కుఫ్ర్) తుడిచిపెట్ట బడుతుంది. నేను ‘హాషిర్’ని. నా తరువాత ప్రజలు ‘హషర్’ మైదానంలో సమీకరించబడతారు. మరియు నేను ‘ఆఖిఖ్’ (సమాప్తుడను). నా తరువాత ఏ ప్రవక్తా రారు”. (సహీహ్ బుఖారి, కితాబుల్ ఫజాయిల్) 4. ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: “నేను ప్రవక్తల్లో చిట్టచివరి వాడను, నా మస్జిదు చిట్టచివరి మస్జిదు”. (ముస్లిం, కితాబుల్- హజ్జ్) ఒక ఉపమానం 5. అల్లాహ్ అంతిమ ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: “మునుపటి ప్రవక్తల మరియు నా ఉదాహరణ ఎలాంటి దంటే ఒక వ్యక్తి తన భవనాన్ని ఎంతో సుందరంగా నిర్మించాడు, కానీ.. ఒక మూల ఒక ఇటుక స్థలాన్ని ఖాళీగా వదిలేసాడు. ప్రజలందరూ ఆ భవనాన్ని సందర్శించి మంత్రముగ్దులయ్యే వారు . కాని ఆ ఖాళీ స్థలాన్ని చూసి ఆశ్చర్యపడేవారు. ఆ స్థలంలో ఉండవలసిన ఇటుకను నేను. ఆ భవనం మునుపటి ప్రవక్తలు. నేను ప్రవక్తల పరంపరను సమాప్తం చేసేవాడిని”. (సహీహ్ బుఖారీ: కితాబుల్-మనాఖిబ్) 6. అల్లాహ్ అంతిమ ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: “అల్లాహ్ ఏ ప్రవక్తనూ దజ్జాల్ ఉపద్రవం గురించి ప్రస్తావించకుండా, భయపెట్టకుండా పంప లేదు. కానీ వారి కాలంలో ‘దజ్జాల్’ రాలేదు) ఇప్పుడు నేను చిట్టచివరి ప్రవక్తను, మీరు చివరి సమాజం వారు. ఖచ్చితంగా వాడు మీ సమాజంలోనే రావలసి ఉంటుంది”. (ఇబ్న్ మాజా, కితాబుల్ ఫితన్) (సశేషం)
  • 14. ప్రవక్త ముహమ్మద్ (స) అన్నారు: "నా కంటి చలువ నమాజులో ఉంచ బడింది" (నసాయీ, ముస్నద్ అహ్మద్) ఇస్లాం ధర్మం మరియు ముహమ్మద్ ప్రవక్త (స) ప్రపంచానికి అందజేసిన సందేశం మహత్తర సందేశం. ఆయన నడిపిన ఉద్యమం ఓ మహాజ్వలమయిన సంస్కరణోద్యమం. అయితే ఈ ఉద్యమం ప్రపంచానికి కొత్తదేమి కాదు. ఈ ఉద్యమాన్నే అల్లాహ్ ప్రభవింపజేసిన ప్రవక్తలందరూ ప్రతి యుగంలో ప్రతి దేశంలో నడిపారు. ఈ ఉద్యమం కేవలం ఆధ్యాత్మిక రంగాన్నే కాక మానవ జీవితానికి సంబంధించిన ప్రతి విభాగాన్ని అపురూపంగా, అద్వితీయంగా తీర్చిదిద్దింది. ఇది ఆధ్యాత్మిక, నైతిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగా లను పరివేష్టించిన సర్వతోముఖమైన ఉద్యమం. మానవ జీవితపు ఏ ఒక్క రంగమూ దీని పరిధికి వెలుపల లేదు. ఇస్లామీయ ఉద్యమాన్ని అర్ధం చేనుకునేందుకు దోహదపడే గ్రంథాలు ఎన్నో వున్నాయి. వీటి ద్వారా ఇస్లామీయ ఉద్యమం ప్రస్ఫుటంగా పరిచయమవుతుంది. కాని ఏ గ్రంథం చదవకుండా ఏ పుస్తకం తిరిగేయకుండా, పెదవులను కదపకుండా ఇస్లాం ధర్మాన్ని పరిచయం చేసే ఓ నిశ్శబ్ద సదాచారం వుంది. మనుషులను నీతిమంతులుగా సుశిక్షితులుగా చేసి వారి జీవితాలను పవిత్రంగా మలచడమే దీని లక్ష్యం. మానవాళిని తొలచి వేస్తున్న అనేక రుగ్మతల్ని దూరం చేసి, మానవుడు నిజమయిన సాఫల్యాన్ని పొందే పురిపూర్ణమయిన జీవన వ్యవస్థను అతనికీ అందజేయడమే దీని కర్తవ్యం. దీన్నే ‘సమాజ్ సలాత్, ప్రార్ధన అంటారు. ఈ ఆచరణ మనిషి ఐహిక జీవితాన్ని సుఖమయం చెయ్యడమేకాక అతని పరలోక జీవితాన్ని ఫలవంతం చేస్తుంది. ఈ సదాచారం చూపే జీవన పథాన్ని అవలంబిస్తే ముప్పులన్నింటి నుండి విముక్తి పొందుతాడు. మానవుడు. సూర్యుడు వాలినప్పటి నుండి రాత్రి పొద్దుపోయే వరకు నమాజ్‌ వ్యవస్థ స్థాపించు. వేకువజామున కూడా ఖుర్‌ఆన్‌ పఠనం చేస్తూ ఉండు. వేకువ జాము ఖుర్‌ఆన్‌ పఠనం (దైవదూతల) సాక్ష్యానికి కారణమవుతుంది. రాత్రివేళ తహజ్జుద్‌ నమాజ్‌ కూడా చేస్తూ ఉండు. ఇది నీకోసం అదనపు నమాజ్‌గా నిర్ణయించబడింది. నీ ప్రభువు నిన్ను త్వరలోనే అత్యున్నతమైన స్తుతిస్థానం మీద అధిష్ఠింప జేయవచ్చు. (దివ్య ఖురాన్: బనీ ఇస్రాయీల్ -78- నేత్ రా నందానికి నెలవు నమాజు అబూ హనాన్ 14 2022 జూలై - సెప్టెంబర్
  • 15. 79) ఈ ఆయతులలో అయిదు పూటల ప్రార్థన ప్రస్తావన ఉంది. క్రమం తప్పకుండా నమాజుని వేళకు చదివితే అత్యున్నతమైన స్తుతిస్థానం ఇవ్వబడుతుంది అన్న వాగ్దానమూ ఉంది. తహజ్జుద్‌ నమాజ్‌ ప్రాశస్త్య ప్రస్తావనా ఉంది. సాకులు చెప్పడం మానాలి ఈనాడు ఎందరో ముస్లిం సహోదరులు తమ నమాజుల పట్ల అశ్రద్ధ వహించడంతో పాటు, నమాజునే ఓ బరువుగా, తమ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు వేసిన సంకెళ్లుగా భావిస్తున్నారు. వీరి ముందు సమాజ ప్రస్తావన వచ్చినప్పుడల్లా, విసుగు చెందడమో, సాకులు వెతకడమో చేస్తారు. ముఖ్యమయిన పని వుందనీ, తప్పించుకోవడమో స్నానం చెయ్యలేదనో, దుస్తులు పరిశుభ్రంగా లెవనో అంటుంటారు. నిజానికి ఇవన్నీ పసలేని మాటలు. ఆ తర్వాత అనర్హులు, అయోగ్యులు వారికి వారసులైపోయాలు. వారు నమాజ్‌ని వదిలేసి మనోవాంఛలకు బానిసలై పోయారు. త్వరలోనే వారు తమ మార్గభ్రష్టత్వానికి తగిన శిక్ష అనుభవిస్తారు. (దివ్య ఖురాన్: మర్యమ్ - 59) అయితే పశ్చాత్తాపం చెంది, సత్యాన్ని విశ్వసించి సదాచార వైఖరి అవలంబించేవారు మాత్రం స్వర్గంలో ప్రవేశిస్తారు. వారికి అణుమాత్రం కూడా అన్యాయం జరగదు. అనంత కరుణామయుడు, తన దాసులకు వాగ్దానం చేసిన, అగోచర జగత్తులోని శాశ్వతమైన స్వర్గవనాలు. ఆ వాగ్దానం తప్పకుండా నెరవేరుతుంది. (దివ్య ఖురాన్: మర్యమ్ - 60-61) కొందరైతే మరీ దారుణం - అల్లాహ్ ఆదేశాలను బహిరంగంగా వ్యతిరేకించడమే కాక, అల్లాహ్ ఆజ్ఞలపట్ల వినయ వినమ్రతలు ప్రదర్శించే వారిని హేళన చేస్తారు. వారు అనాగరికులని, ఆటవికులని వెక్కిరిస్తారు. మీరు మాట్లాడుతున్నదేమిటని అడిగితే "మేమేదో పరిహాసంగా అంటున్నాము” అంటారు వారు. వారికి చెప్పు: “మీరు అల్లాహ్ తో, ఆయన సూక్తులతో, ఆయన ప్రవక్త తోనా పరిహాసమాడేది? ఇకనైనా సాకులు చెప్పడం మానుకోండి. మీరు సత్యాన్ని విశ్వ సించిన తర్వాత తిరస్కార వైఖరి అవలంబించారు. మేము మీలో కొందరిని క్షమించినా మిగిలినవారిని మాత్రం తప్పకుండా శిక్షిస్తాం. వారు పరమ దుర్మార్గులు".(దివ్య ఖురాన్: తౌబహ్ - 65-66) వీరికి ఏమయ్యింది అల్లాహ్ పట్ల భయంతో రాళ్ళు సయితం ద్రవిస్తాయి. వీరి హృదయాలు ఆ రాళ్ళకన్నా గట్టిగా ఉన్నాయా? జీవరాసులలో కెల్లా వీరు విచిత్రమయినవారు. అల్లాహ్ ఆదేశాలను వింటున్నారు. ఆయన ధరిత్రిపైనే నివసిస్తున్నారు. ఆయన ఇచ్చిందే తొడుగుతున్నారు. ఆయన ప్రసాదించిందే తింటున్నారు. ఆయన పైనే ఆధారపడి జీవిస్తు న్నారు. కాని ఆయన ఆదేశాలనే ధిక్కరిస్తు న్నారు. ఆయన ఆజ్ఞలనే జవదాటుతున్నారు. "అసలు వారికేమయింది, ఈ హితబోధ నుండి ముఖం త్రిప్పుకుంటున్నారు." (దివ్య ఖురాన్: ముద్దస్సిర్- 49-51) నమాజు అంటే జరిమాన కాదు నమాజు జరిమాన ఎంత మాత్రం కాదు. పరిహారమూ, పన్ను అంతకన్నా కాదు. ఇది ముస్లిం సమాజానికి అప్పగించబడిన ఓ దివ్య అమానతు. దీన్ని మనిషి రోజు ఐదు సార్లు చూస్తూ, దీన్ని సంరక్షణకు కావలసిన కట్టుదిట్టమయిన చర్యలు తీసుకుంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే మనం నీతిమంతులమనీ, సచ్చిలత గల వ్యక్తిలమనీ, నిజాయితీ పరులమనీ, నిష్కల్మష హృదయులమనీ, సత్య సంధులమనీ హక్కులను రక్షించేవారలమనీ, దయార్ద్ర హృదయులమనీ, శ్రేయోభిలాషులమనీ, మన నమాజు చెప్పకనే చెబుతుంది. తోడుగా క్రమం తప్పకుండా పాటించే వ్యక్తిని గొప్పగా నన్మానించడం జరుగుతుందన్న శుభ వార్తను కూడా అందజేస్తుంది. రాత్రి చీకటిలో మస్జీద్ వైపు నడిచే వెళ్లేవారికి 15 2022 జూలై - సెప్టెంబర్
  • 16. నేనిస్తున్న శుభవార్త - రేపు ప్రళయ దినాన వారికి సంపూర్ణమైన జ్యోతులు ఇవ్వఫ్వబడతాయి. అన్నారు ప్రవక్త (స). (తిర్మిజీ) విశ్వాసులు తప్పకుండా కృతార్థులవుతారు. (వారి గుణగణాలు ఇలా ఉంటాయి) వారు తమ నమాజులో ఎంతో అణుకువ, నమ్రతలు పాటిస్తారు. పనికిమాలిన విషయాలకు చాలా దూరంగా ఉంటారు. తమ సంపద నుండి (పేదల ఆర్థిక హక్కు) జకాత్‌ చెల్లిస్తారు. వారు తమ భార్యలు, బానిసస్త్రీల విషయంలో తప్ప (ఇతరస్త్రీల విషయంలో) తమ మర్మావయవాలు కాపాడుకుంటారు. (అంటే వ్యభిచారం తదితర అశ్లీల చేష్టలకు పాల్పడరు.) .... వారు తమ అప్పగింతలు, ప్రమాణాలు, ఒప్పందాల విషయంలో నిజాయితీగా వ్యవహరిస్తారు. తమ నమాజులను క్రమం తప్పకుండా, నియమబద్ధంగా పాటిస్తారు. అలాంటివారే మహోన్నత స్వర్గానికి వారసులవుతారు. అక్కడే వారు కలకాలం (హాయిగా) ఉంటారు. (దివ్య ఖురాన్: మోమినూన్ - 01-11) అల్లాహ్ అపార అనుగ్రహాలు మనకు ప్రసాదించ బడ్డాయి అనడానికి తార్కాణమే నమాజు. విశ్వ ప్రభువయిన అల్లాహ్ కు పూర్తి సమర్పణయే నమాజు. తనకన్నా పై హోదాలో వున్న వ్యక్తుల్ని క్రింది ఉద్యోగులు గౌరవిస్తున్నట్లు మనం ప్రతిరోజు చూస్తువుంటాము. సంతోష ఘడియల్లో విందు ఇవ్వడం, కష్ట సమయాల్లో వారి సహాయాన్ని కోరడం, వారిలోని పుణ్య పురుషుల రాక శుభప్రదమని భావించడం, వారిలోని మేధావుల పేర్లు తమ సంతానానికి పెట్టి సంతోషించడం మనం గమనిస్తూ ఉంటాము. హోదా సంపద గలవారు ఏకాస్త అలిగినా వారిని బుజ్జగించడానికి మనిషిపడే పాట్లు కూడా దైనందిన జీవితంలో మనం గమనిస్తూనే వుంటాము. కాని అదే మన నిజ ఆరాధ్య దైవం విషయానికి వస్తే ఆయన సర్వలోక సృష్టికర్త, సార్వ భౌమాధికారి, తూర్పు పడమరలకు స్వామి, ఆయన ఒక్కడేనని, ఆయనకు భౌతిక ఆకారం లేదనీ, ఆయన అండ, పిండ, -బ్రహ్మాండానికి అతీతుడనీ, ఆయన దేశ, కాలాలకు పరిమితమయిన వాడు కాడని, ఆయనకు సాటి సరిసమానమైన ఏ వస్తువు మరే ప్రాణీ ఈ ప్రపంచలోనే లేదని తెలుసు. కానీ... సర్వలోక ఉపాధి ప్రదాత అయిన అల్లాహ్ ను ఆరాధించడం. మానవుణ్ణి అద్భుతమైన ఆకృతిలో సృజించిన అధికారులందరికన్నా గొప్ప అధికారి అయిన అల్లాహ్ ను వేడుకోవడం మనకు ఎందుకు భారంగా తోస్తున్నట్లు? ఎందుకు మనం దానిని చెల్లించ సాధ్యం కానీ పన్నులా భావిస్తున్నాము? (సరే, మీకేవైనా ఇబ్బందులుంటే) సహనం, ప్రార్థనల ద్వారా (నా) సహాయాన్ని అర్థించండి. ప్రార్థన (నమాజ్‌) కాస్త కష్టమైన పనే, సందేహం లేదు. కాని ఒకరోజు తమ ప్రభువును కలుసుకోవలసి ఉందని, ఆయన సన్నిధికే మరలిపోవలసి ఉందని భావించే దైవభీతిపరులకు మాత్రం ప్రార్థన (నమాజ్‌) చేయడం కష్టమేమీ కాదు. (దివ్య ఖురాన్: బఖరః -45-46) ఇహపరాల సాఫల్యం ఆ నిజ ప ్ర భు చేతుల్ లో నేగా ఉంది. (విశ్వాసులారా!) ఇలా ప్రార్థించండి: “దేవా! (విశ్వ)సామ్రాజ్యాధిపతీ! నీవు తలచుకున్న వారికి రాజ్యం ప్రసాదిస్తావు: తలచుకున్న వారి నుండి రాజ్యాన్ని ఊడబెరుకుతావు. అలాగే నీవు కోరిన విధంగా కొందరికి గౌరవ ప్రతిష్ఠలు అనుగ్రహిస్తావు; మరికొందరిని పరాభవం పాల్జేస్తావు. అన్ని విధాల మేళ్ళు నీ చేతిలోనే ఉన్నాయి. నిస్సందేహంగా నీవు ప్రతి పనీ చేయగల శక్తిమంతుడవు. నీవే రాత్రిని పగటిలోకి, పగటిని రాత్రిలోకి ప్రవేశపె డ్తున్నావు. అలాగే నిర్జీవమైన దాన్నుండి సజీవమైనదాన్ని, సజీవమైన దాన్నుండి నిర్జీవమైన దాన్ని వెలికి తీస్తావు. నీవే తలుచుకున్న వారికి ఇతోధికంగా ఉపాధినిస్తావు.” (ఖురాన్: ఆల్ ఇమ్రాన్ -26-27) 16 2022 జూలై - సెప్టెంబర్
  • 17. అదే సమయంలో మిథ్యా దైవాల నిస్సహాయతను కూడా కాస్త గమనించండి. “మీ నమ్మిక నిజమైతే వాటిని మొరపెట్టుకోండి- అవి మీ మొరలు ఆలకిస్తాయేమో చూద్దాం! నడవటానికి వాటికేమైనా (సహజ సిద్ధమైన) కాళ్ళున్నాయా? పట్టుకోవటానికి వాటికేమైనా చేతులున్నాయా? పోని చూడ టానికి ఎమైనా కళ్ళున్నాయా? వినడానికి వాటికేమైనా చేవులున్నాయా?” (దివ్య ఖురాన్: ఆరాఫ్: 194-195) మానవులారా! ఒక ఉదాహరణ ఇస్తున్నాం వినండి. మీరు అల్లాహ్ ను వదిలి ప్రార్థిస్తున్న మిథ్యా దైవాలన్నీ కలిసి కనీసం ఒక ఈగనైనా సృష్టించదలచుకుంటే, దాన్ని కూడా సృష్టించ లేవు. పైపెచ్చు ఆ ఈగ వాటి దగ్గర్నుంచి ఏదైనా వస్తువుని ఎగరేసుకుపోతే ఆ వస్తువుని సయితం అవి దాన్నుండి విడిపించుకోలేవు, సహాయం కోరేవారు, సహాయం అర్ధించబడే వారు - ఇద్దరూ బలహీనులే. (దివ్య ఖురాన్: హజ్: 72) కృతజ ్ఞ తా భావానికి నిలువెత్ తు నిదర్శనం నమాజు అపార అనుగ్రహాలు ప్రసాదించిన మహోన్నతుడైన ఆ పరమ దాతకన్నా, కృపాకరుడైన అల్లాహ్ కు మించి ప్రపంచంలో ఏదైనా "వుందా! ఆయనే కదా నఖశిఖ పర్యంతం మనల్ని తీర్చిదిద్దింది! ఆయనే కదా.... అందమైన ఆకారం మనకు ప్రసాదించింది. ఆయనే కదా... లోపాలు లేకుండా మనల్ని మలచింది. మంచి చెడులను వేరుపరిచే విచక్షణా జ్ఞానాన్ని ప్రసాదించినవాడు ఆయనే కదా!`లెక్కలేనన్ని, లెక్కించ సాధ్యం కాని వరానుగ్రహాలను, ఊహ కందని ఉపాధిని మనకు ఇవ్వడంతోపాటు మనల్ని ఆరోగ్యవంతులుగా చేశాడు. ఆధ్యాత్మికంగా మార్గ దర్శకత్వం వహించాడు. ఆలూ బిడ్డల్ని ఇచ్చి మనల్ని ఆనందపరిచాడు. శాంతి నిలయం లాంటి ప్రదేశంలో మనల్ని నివశింపజేశాడు. శాంతి ప్రియులైన ఇరుగు పొరుగు వారిని కల్పించాడు, మరి ఇలాంటి మహిమాన్వితుడికి మనం కృతజ్ఞతలు తెలుపుకోవటం ధర్మం కాదా? ఆయన్ని మించిన కరుణ కటాక్షాలు గలవాడు మరెవడయిన ఉన్నాడా? లేడు. ముమ్మాటికి లేనే లేడు. నిస్సందేహంగా బహుమానపు విలువని బట్టి కృతజ్ఞతలూ వుంటాయి. మనకు ప్రాప్తమయి ఉన్న సమస్తమూ అల్లాహ్ ప్రసాదితమే అయినప్పుడు మనం ఎంతగా ఆయనకు కృతజ్ఞులమై ఉండాలో ఆలోచించండి! మన జీవన్మరణాలు ఆయన చేతిలోనే ఉన్నప్పుడు మనం ఆయనకు ఎంతగా భయ పడాలో ఆత్మ సమీక్ష చేసుకోండి! "నా కంటి చలువ నమాజులో ఉంచ బడింది" అని దైవ ప్రవక్తల నాయకులు, సుభక్తాగ్రేసరుల్లో అగ్రజులు అయినా మహనీయ ముహమ్మద్ (స) అంటుంటే, మనం మన కంటి చలువను అరచేతి అనర్థాల పుట్టయిన చరవాణిలో వెతుక్కుంటున్నాము. ఉన్న ఆస్తిని, వ్యాపారాన్ని, ప్రాపంచిక భోగభాగ్యాలను మన నేత్రానందంగా భ్రమించి బతుకుతున్నాము. ఇది దేనికి తార్కాణం? మన పురోగమనానికా? తిరోగమనానికా? అల్లాహ్ కు మనలో నచ్చే గుణం కృతజ్ఞతాభావం. కనుకనే ఇలా తెలియజేశాడు. మీరు కృతజ్ఞులయి వుంటే మీకు మరిన్ని వరాలు అనుగ్రహిస్తానని కృతములయిపోతే నా శిక్ష అత్యంత కఠినంగా ఉంటుందనీ మీ ప్రభువు మిమ్మల్ని హెచ్చరించాడు." (దివ్య ఖురాన్: ఇబ్రాహీం- 7) కాబట్టి మనం ‘’ప్రజలారా! నాపట్ల కృతజ్ఞతగా సత్కార్యాలు చేయండి’’ అన్న అల్లాహ్ ఆదేశానికి శిరసా వహిస్తూ . అయిదు పూటల నమాజును క్రమం తప్పకుండా పాటించి ‘’నా దాసులలో చాలా తక్కువమంది కృతజ్ఞులైన వారున్నారు.’’ (దివ్య ఖురాన్: సబా- 12-13) అని అల్లాహ్ అన్న ఆ అదృష్టవంతులు జాబితాలో చేరేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నిద్దాం! దేన్నయినా వాయిదా వెయ్యొచ్చు కానీ నమాజును మాత్రం వాయిదా వేయకూడదు ఆయన ఎరుకతో జీవిద్దాం!! 17 2022 జూలై - సెప్టెంబర్
  • 18. ‘పై చేయి (ఇచ్చే హస్తం) క్రింది చేయి (పుచ్చుకునే హస్తం) కన్నా మేలైనది" అన్నారు మహనీయ ముహమ్మద్ (స). (సహీహ్ నసాయీ) మనం ఎవరికి పుట్టామన్నదే సమాజంలో మన స్థానాన్ని నిర్ణయించకూడదు’ అంటే మనం ఏదోకటి ఎవరొకరికి ఇవ్వడం అలవాటు చేసుకోవాలి.. జీవితంలో ఆనందం ఎప్పుడు లభిస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టమే.. కానీ మనందరికీ అనుభవంలోకి వచ్చే ఆనంద మార్గం ఒకటి ఉంది. అదే పొందటం.. మనం ఏదైనా పొందినప్పుడు చాలా ఆనందిస్తాం.. మనం కొత్త వస్తువు కొంటే చాలా ఆనందిస్తాం. ఎవరైనా మనకు ఓ బహుమతి ఇస్తే చాలా ఆనందిస్తాం.. ఆ రోజంతా సంతోషంగా ఉంటాం. అయితే మనకు అర్థం కాని విషయం.. మనలో చాలా మందికి అనుభవంలోకి వచ్చే ఓ విషయం ఉంది. అదే ఇవ్వడం.. అవును ఇవ్వడంలోనూ ఆనందం ఉంటుంది. ఏదైనా కష్టంలో ఉన్నవారికి సాయం చేస్తే మనస్సు అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. మనం ఎవరి వద్ద నుంచి ఏదైనా పొందిన దాంతో వచ్చే ఆనందం కంటే.. ఏదైనా ఇచ్చినప్పుడు పొందే ఆనందం చాలా ఎక్కువ. అంతే కాదు.. అది చాలా గొప్పది కూడా. కొందరికి కడుపు నిండితే పండుగ. మరికొందరికి ఎదుటివారి కడుపు నింపితే పండుగ. తమ కోసమే తాము అనుకుంటే అంతటితో జీవితం ఎలాగూ అంతమైపోతుంది. ఇతరుల కోసమూ ఆలోచన చేస్తే వారి కీర్తి మట్టి రేణువులున్నంత వరకు అజరామరమవుతుంది. ఇక ఎవరైతే తమ కడుపు నింపుకోవడానికి ఇతరుల కడుపు కొడతారో అలాంటి వారి బతుకు దండగ. అలాంటివారికి ముందుంటుంది (పరలోకంలో) మొసళ్ల పండగ. ఎవరి వద్ద నుంచైనా బలవంతంగా లాక్కున్నప్పుడు, ఆ అపరాధ భావం వెంటాడి మనశ్శాంతిని దూరం చేస్తుంది తాను మనిషైతే. సంతృప్తినివ్వని సంపద ఎంత ఉండి ఏం ప్రయోజనం? అని ఏదోక నాడు పశ్చాత్తాపపడాల్సిన రోజు జీవితంలో ఎదురవుతుంది. మనలో ఇతరులకు ఏ విధంగా నేను సహాయపడగలను అనే ఆలోచన మొదలైందంటే.. మనం జీవితంలో చాలా ఎదిగినట్టు.. మన జన్మ సార్థకత దిశగా అడుగులు వేస్తున్నట్టు.. మనిషిగా పుచ్చుకొనుటకంటే ఇచ్చుట మేలు శాంతి ప్రియ 18 2022 జూలై - సెప్టెంబర్
  • 19. మనం ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్నట్టు. మనిషి ఎప్పుడైనా సరే.. నా ఎదుగుదల ఇతరుల కోసం అనే భావనతో ఉన్నత స్థితిని పొందుతాడు. అందుకే ఒక్కసారి ఇతరులకు సహాయ పడి చూడండి.. అది ఎంత చక్కటి అనుభూతి కలిగిస్తుందో..! అందుకే పెద్దలన్నారు - "ప్రార్థించే పెదవులకన్నా సహాయం చేసే చేతులు మిన్న" అని. ఒక్క మాటలో చెప్పాలంటే - ఇచ్చిపుచ్చుకోవడం ప్రతి ఒక్కరి జీవితంలో సహజం. ఇవ్వడం ఆనందం, తీసుకోవడంలో ఎక్కువ ఆనందం. పుచ్చుకోవడంలో ఉన్న ఆనందానికి తృప్తి లేదు. ఇవ్వడంలో ఉన్న ఆనందానికి సంతృప్తి ఉంటుంది. ఆకలి గొన్న వారికి అన్నం, దాహం వేసిన వారికి మంచి నీళ్ళు పొయ్యడం, పీజు కట్టలేని వారికి డబ్బులు కట్టడం, వీలైనంతగా అందరినీ ఉన్నతులుగా చేయాలి అనే ఆలోచనలు సమాజంలో విస్తరించాల్సి ఉంది. ఎవరి దగ్గరనైనా సంపద ఎక్కువగా ఉన్నదంటే అది సమాజం నుంచి వచ్చిందే, పూర్వం నుంచి ఉన్నా! అదీ ఆ నాటి సమాజం అందించిందే. మనం తినే ఆహారం, ఉండే ఇల్లు, ధరించే వస్త్రం, జీవితానికి ఉపయోగపడే విద్య, వినియోగించే ప్రతి వస్తువు... ప్రకృతి నుంచి, ఇతరుల సహాయ సహకారాలతో పొందుతాం. ప్రకృతి ద్వారా దేవుడు ప్రతిఫలాపేక్ష రహితంగా సమస్త జీవరాశికి లేదనకుండా అన్నీ సమకూరు స్తాడు. కాని, మనిషి దొరికినంత దోచుకోవడమేగాని తిరిగి ఇవ్వడం బహు తక్కువ. ప్రతిదీ పరుల నుంచి గ్రహించి ఇతరులకు ఏమీ పంచనివాడు అసలైన స్వార్ధపరుడు. ఇవ్వడమంటే ధనం మాత్రమే కాదు. ప్రతి ఒక్కరి దగ్గర అమూల్యమైన ధనేతర సంపద చాలానే ఉంటుంది. ఉదాహరణకు - స్నేహితుడికి మన హృదయాన్ని. శత్రువుకు క్షమను. పెద్దలకు గౌరవాన్ని, పిన్నలకు అవ్యాజానురాగాన్ని, యజమానికి విశ్వాసాన్ని, అర్ధాంగికి అనురాగాన్ని,పిల్లలకు వాత్సల్యాన్ని ఇవ్వాలి. వారికి చక్కటి ఆదర్శంగా నిలిచి, తల్లిదండ్రులు మనల్ని చూసి గర్వపడేలా నడుచుకోవాలి. మనకు మనం ఆత్మగౌరవాన్ని ఇచ్చుకోవాలి. ఎవరికి ఏది ఇచ్చి తిరిగి పొందాలన్న ఆశతో ఇవ్వకూడదు. ఇవన్నీ మన దగ్గర తరగని సంపద. ఇచ్చేవాడిది ఎప్పుడూ పైచెయ్యే. పుచ్చుకొనే వాడిది ఎప్పుడూ క్రింది చెయ్యే! ఇవ్వగలిగినంత మాత్రాన అహంకారంతో ఇవ్వకూడదు. ఇచ్చే మన గుణాన్ని బహిర్గతపరచిన ఆ వ్యక్తికి, ఆ వ్యక్తిని పరీక్షగా మన వద్దకు పంపిన అల్లాహ్ యెడల కృతజ్ఞతా భావంతో ఇవ్వాలి. అది కూడా చేయలేని స్థితిలో ‘ఇతరులు మనకు ఏది చేస్తే అప్రియమో అది ఇతరులకు చేయకుండా ఉంటే చాలు. ఇవ్వడం ఏదైనా కావచ్చు- డబ్బు, ప్రేమ, గౌరవం, ప్రోత్సాహం... నిస్వార్థంగా ఇవ్వగలగడం ఒక గొప్ప కళ అని అర్థమవుతుంది. సహజంగా ఈ కళ అంత తేలిగ్గా అలవడదు. మనిషిది సహజంగా వసూలు చేసుకునే స్వభావం. దాచిపెట్టుకునే మనస్తత్వం. అవసరానికి సరిపడేవే కాదు, దాన్ని మించి ఎన్నో రెట్లు దాచిపెట్టుకోవాలనే తాపత్రయం. ప్రకృతి ద్వారా అల్లాహ్ ప్రాణికోటికి సూర్యరశ్మి గాలి, నీరు, భూమి, వృక్షాలు, జంతువులు మొదలైనవి అందించకపోతే ‘మనిషి’ ఎక్కడుండేవాడు, మనుగడ ఎలా సాగించేవాడు? ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. మనిషి చేసే దుష్కర్మలవల్ల భూకంపాలు, సునామీలు, వరదలు లాంటి వైపరీత్యాలు దాపురిస్తున్నాయి. జీవితంలో మనిషి ఇవ్వడం, ఇవ్వడంలోని శక్తినీ గ్రహిస్తే అంతరంగంలో సంతుష్టిని ప్రశాంతతను అనుభవించగలుగుతాడు. 2022 జూలై - సెప్టెంబర్